అన్వేషించండి

Election Commission: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఏర్పాట్లపై సీఎస్ కీలక ఆదేశాలు

Telangana News: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో సీఎస్ శాంతికుమారి అన్ని శాఖల అధికారులతో వేడుకల నిర్వహణపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

EC Permission To Telangana Formation Day Celebrations: జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆ రోజున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసీ అనుమతి లభించినందున ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుగా గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నట్లు సీఎస్ తెలిపారు. తర్వాత పరేడ్ గ్రౌండ్ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటారని చెప్పారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని నిర్ధేశించారు. ప్రముఖులు ప్రయాణించే మార్గాల్లో అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలు కేటాయించేటప్పుడు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని  పోలీస్ శాఖను ఆదేశించారు.

'సమన్వయంతో పని చేయాలి'

సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అలాగే, రోడ్డుకు ఇరువైపులా రంగురంగుల జెండాలను అలంకరించాలని అన్నారు. పండుగ వాతావరణం ప్రతిబింబించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు నిర్దేశించారు. వేడుకలు చూసేందుకు వచ్చే ప్రజలు ఎండలకు గురికాకుండా బారికేడింగ్ ఏర్పాటు చేసి షామియానాలు, టెంట్ ఏర్పాటు చేయాలని.. ఆర్అండ్‌బీ శాఖను ఆదేశించారు. త్రీఫేజ్ విద్యుత్ సరఫరా చేయాలని.. వేదిక వద్ద నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని ఇంధన శాఖకు ఆదేశాలిచ్చారు. వేడుకల నిర్వహణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

Also Read: TS EAPCET Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో డిన్నర్ భేటీ!
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో డిన్నర్ భేటీ!
Breaking News:
"మొన్నటి ఎన్నికల్లో చెత్తను క్లీన్ చేశారు" కొడాలి నానిపై చంద్రబాబు సెటైర్లు 
KTR At Yuva Sangrama Sadassu : 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం! నిరుద్యోగుల బాధ్యత నాదేనన్న కేటీఆర్
"అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల బాధ్యత నాదే" సరూర్‌నగర్‌ సభలో కేటీఆర్ ప్రకటన 
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget