ED Shock For TRS MP : టీఆర్ఎస్ ఎంపీకీ ఈడీ షాక్ - ఆస్తుల జప్తు ! కేసేమిటంటే
టీఆర్ఎస్ ఎంపీ నామాకు చెందిన మధుకాన్ సంస్థ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. బ్యాంక్ రుణాలు ఎగ్గొట్టిన కేసులో ఈడీ చర్యలు చేపట్టింది.
ED Shock For TRS MP : టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కంపెనీ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జప్తు చేసింది. . రాంచీ ఎక్స్‌ప్రెస్ వే కేసులో మధుకాన్ కు చెందిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రూ.96 కోట్ల విలువైన మొత్తం 105 ఆస్తులు అటాచ్ చేసినట్లుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్ లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మధుకాన్ కంపెనీ పేరుతో భారీగా లోన్లు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించినట్లు ఆరోపణలు వున్నాయి. రూ.1064 కోట్ల మేర బ్యాంకులను మోసం చేసినట్లు ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలోనే నామా నివాసంతో పాటు కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆ రుణానికి సంబంధించి నాగేశ్వరరావు పర్సనల్ గ్యారంటీర్ గా వున్నారు.
ED has provisionally attached 105 immovable properties and other assets worth Rs 96.21 Crore belonging to Madhucon Group of companies and its directors & promoters in a money laundering case against M/s Ranchi Expressway Ltd Bank Fraud, under the provisions of PMLA 2002.
— ED (@dir_ed) July 2, 2022
రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే ఎస్పీవీ కంపెనీ BOT పద్ధతిలో ప్రాజెక్టు చేపట్టింది. నేషనల్ హైవే సంస్థ ప్రాజెక్టు పూర్తి కోసం ముందుకు వచ్చింది. కానీ ఈడీ విచారణల కారణంగా వెనక్కి వెళ్ళిపోయింది. ఈ ప్రాజెక్టులో నిధులు మళ్లించడానికి అసలు అవకాశం లేదని నామా నాగేశ్వరరావు చెబుతున్నారు. గతంలో విచారణకు రావాలని ఆయనకు నోటీసులు కూడా ఈడీ ఇచ్చింది. అియతే ఆయన హాజరు కాలేదు.
దీనిపై బీజేపీ ఎంపీ అర్వింద్ స్పందించారు. టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేయడంపై ఈడీ చెప్పిన వివరాలను ఆయన ట్వీట్ చేశారు.
ED attaches 105 properties of the Madhucon Group of #TRS MP Nama Nageshwar Rao worth Rs 96.2 Crore, in a Bank #Fraud case, under the provisions of PMLA ?!#EnforcementDirectorate pic.twitter.com/tx5ozfvCsJ
— Arvind Dharmapuri (@Arvindharmapuri) July 2, 2022