Earth Quake: ఉలిక్కిపడ్డ నల్లమల... శ్రీశైలం జలాశయం చుట్టూ భూప్రకంపనలు
సోమవారం వేకువ జామున ఆ ప్రాంతం ఒక్కసారిగా షేక్ అయింది. ఏం జరిగిందో తేరుకునే లోపు ఇంట్లోని వస్తువులు కింద పడ్డాయి. అధికారులు చెప్పేంత వరకు అది భూ ప్రకంపనలు అని తెలియలేదు.
నల్లమల అటవీ ప్రాంతంలో సోమవారం వేకువ జాము వచ్చిన ప్రకంపనలు ఉలిక్కిపడేలా చేశారు. సుమారు ఐదుగంటల ప్రాంతంలో నల్లమలలోని కృష్ణానది పరిసరాల్లో స్వల్ప భూకంపం సంభవించింది.
శ్రీశైలం జలాశయానికి పశ్చిమ దిక్కున 44 కిలోమీటర్ దూరంలో, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు తూర్పున 18కిలోమీటర్ దూరంలో భూ కంపకేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తింంచారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని ఎన్‌జీఆర్‌ఐ ప్రకటించింది.
నల్లమల అడవుల్లో ఏడు కిలోమీటర్ల లోతున భూకంపం వచ్చినట్టు ఎన్జీఆర్‌ఐ పేర్కొంది. వేకువ జామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంప తీవ్రత భూకంప లేఖినిలో 3.7గా నమోదైనట్టు ఎన్జీఆర్‌ఐ తెలిపింది.
నల్లమలలోని అచ్చంపేట, కోల్లాపూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, బల్మూరు మండలాలలతోపాటు శ్రీశైలం సమీప గ్రామాలు, గిరిజన గూడేల ప్రజలు ఈ ప్రకపంనలతో ఆందోళనకు గురయ్యారు. కొన్ని ఇళ్లలోని వంట పాత్ర, డబ్బాలు, ఇతర వస్తువులు కింద పటడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ఇంటి నుంచి బయటకు వచ్చి కేకలు వేశారు.
భూ ప్రకంపనలతో శ్రీశైలం జలాశయం వద్ద పరిస్థితులపై అధికారులు ఆరా తీశారు. డ్యాం గ్యాలరీలతోపాటు ఈగల పెంటలో భూ ప్రకంపనలు గుర్తించే రెండు సెన్సార్లు ఉన్నాయి. ప్రకంపనలు గుర్తించి అధికారులు సందేశం పంపించారు ఎన్జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు. శ్రీశైలం ఆనకట్టకు పెద్ద ముప్పు తప్పిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి రాలేదని... ఇదే మొదటిసారి అని అంటున్నారు.
భూకంపానికి గల కారణాలపై శాస్త్రవేత్తలు, అధికారులు రీసెర్చ్ స్టార్ట్ చేశారు. దీనికి ఆత్మకూర్ ఫాల్ట్ కారణమని అనుమానిస్తకున్నారు. అక్కడి భూమిలోని రాతి పొరల్లో ఏర్పడిన ఒత్తిడి భూకంపానికి దారి తీసి ఉంటుందని ఓ అంచనా వేస్తున్నారు. చిన్న ప్రకంపనలైనందున వీటికి ఎవరూ భయపడాల్సిన పని లేదని... ఇలాంటివి చాలా ప్రాంతాల్లో వస్తుంటాయని గుర్తుచేశారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తున్న ఈ నేపథ్యంలో భూ ప్రకంపనలు ఆందోళన కలిగించాయి. అధికారులు కూడా టెన్షన్ పడ్డారు. సాధారణంగా నీటి ప్రవాహాలతో భూమి లోపల ఉన్న పగుళ్ల కారణంగా సర్దుబాటు జరుగుతుంటుంది. ఇప్పుడు వచ్చింది అలాంటిదే అనేందుకు అవకాశం లేదంటున్నారు. అధికారులు. గతేడాది పులిచింతలలో ఇలాంటి సర్దుబాటును శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే శ్రీశైలంలో రాతిపొరల్లో ఉన్న పాల్ట్ కారణంగానే ఈ ప్రకంపనలు వచ్చాయని విశ్లేషిస్తున్నారు. రాత్రి వరకు మళ్లీ ఎలాంటి ప్రకంపనలు లేవని... అందుకే వరదతో వచ్చిన ప్రకంపనలుగా చెప్పలేమంటున్నారు అధికారులు.
ALSO READ:దళిత బంధు పథకం కాదు.. ఉద్యమం.. గుర్తుంచుకోవాలే: కేసీఆర్