అన్వేషించండి

TPCC Mallu Ravi : హైదరాబాద్ కు దిగ్విజయ్ - సీనియర్లను సెట్ రైట్ చేయగలరా ?

సీనియర్లకు సర్ది చెప్పేందుకు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వస్తున్నారు. రేవంత్ వర్గంతో పాటు సీనియర్లు తమ వాదన వినిపించనున్నారు.

TPCC Mallu Ravi   :   కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్  హైదరాబాద్ కు రానున్నారు. ఆయన కాంగ్రెస్ అసంతృప్త నేతలతో సమావేశం అవుతారు. ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీలలో ఎక్కువ మంది వలస నేతలకు పదవులను కట్టబెట్టారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక సమావేశాలు పెట్టుకుని కమిటీల నియామకంపై తమ నిరసనను సీనియర్ నేతలు వ్యక్తం చేశారు. నివేదిక... దీంతో హైకమాండ్ దిగి వచ్చింది. సలహాదారుడిగా దిగ్విజయ్ సింగ్ ను హైకమాండ్ నియమించింది. దీంతో దిగ్విజయ్ పలువురికి ఫోన్లు చేసి తొందరపడవద్దని చెప్పారు. దీంతో మంగళవారం  సాయంత్రం జరగాల్సిన సమావేశాన్ని రద్దుచేశారు.  హైదరాబాద్ కు వచ్చి నతర్వాత దిగ్విజయ్  అందరితో సమావేశమై పార్టీ పరిస్థితిపై చర్చిస్తారు. సీనియర్ నేతల అభ్యంతరాలను విని హైకమాండ్ కు నివేదిక ఇస్తారని చెబుతున్నారు.

రెండు వర్గాల వాదనలు విననున్న దిగ్విజయ్ 
 
ఇప్పటికే దిగ్విజయ్ సింగ్‌ను ఢిల్లీలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కలిసి తన వాదన వినిపించినట్లుగా తెలుస్తోంది. టీ పీసీసీ సీనియర్ల వ్యవహారశైలి, ఇతర పార్టీలతో అంట కాగుతున్న వైనం.. సొంత పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న విషయాలపైనా రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటనపై రేవంత్ వర్గం పెద్దగా గాభరా పడటం లేదు.   సీనియర్ నేతలతో చర్చించి వారితోపాటు ఇతర నాయకులతో కూడా మాట్లాడి సమన్వయ పరుస్తారని సీనియర్ నేత మల్లు రవి చెబుతున్నారు.  కాంగ్రెస్ పార్టీ ప్రజాసమస్యలపై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సన్నద్ధం చేస్తారని అంటున్నారు. 

ఖర్గేపై బీజేపీ విమర్శలను ఖండించిన మల్లు రవి

మరో వైపు  ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదనే పచ్చి నిజం చెబుతే బీజేపీ వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని మల్లు రవి మండిపడ్డారు.  ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేది బీజేపీ వాళ్ళు చెప్పాలన్నారు.  స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ వాళ్ళు లేదనేది వాస్తవం కాదా...అని మల్లు రవి ప్రశఅనించారు.  బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారని..  మల్లికార్జున ఖర్గే ను రబ్బరు స్టాప్ అనడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.  ఒక దళిత నేతగా ఖర్గే ఓటమి ఎరగని నాయకులని మల్లు రవి గుర్తు చేశారు.  మల్లికార్జున్ ఖర్గే 8 సార్లు ఎమ్మెల్యే గా, మూడుసార్లు ఎంపీ గా, గెలవడమే కాకుండా కర్ణాటక లో హోమ్, పరిశ్రమలు, నీటి పారుదల మంత్రిగా, సీఎల్పీ నేతగా కేంద్రంలో రైల్వే, లేబర్ మంత్రిగా పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులుగా పని  చేసిన అనుభవం ఉందన్నారు.  ఆయన ఎన్నికల ద్వారా అత్యధిక మెజారిటీ తో గెలిచిన ఏఐసీసీ అధ్యక్షులు, ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగితే ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ గెలిచాయి. అలాంటి వ్యక్తిని రబ్బర్ స్టాంప్ అంటారా.. ? అని ప్రశ్నించారు. 

బీజేపీకి ఐడియాలజీ లేదన్న మల్లు రవి

బీజేపీలో అమిత్ షా, మోడీ తప్ప మిగితా వాళ్ళందరూ రబ్బరు స్టాప్ లేనని మల్లు రవి మండిపడ్డారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిపించిన ఘనత ఖర్గే దన్నారు.  దళితులను అవమాన పరిచే విధంగా బీజేపీ వాళ్లు మాట్లాడుతున్నారు... స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ సిద్ధాంతాలే నేటికి కొనసాగుతున్నాయన్నారు.  కాంగ్రెస్ అంటే వ్యక్తులు కాదు ఒక సిద్ధాంతమని..  బీజేపీ కి ఏ ఐడియాలజీ లేకనే ఇతర పార్టీల నుంచి చేరికలు చేసుకుంటున్నారని విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget