News
News
X

Telangana News : తెలంగాణలో కలపకపోతే ఉద్యమమే - డెడ్‌లైన్ పెట్టింది ఎవరంటే ?

తెలంగాణలో కలపాలని ధర్మాబాద్ తాలూకా ప్రజలు ఉద్యమం ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు తమకు అందాలంటున్నారు.

FOLLOW US: 
Share:

Telangana News : తెలంగాణలో కలిసేందుకు పొరుగు రాష్ట్రాల సరిహద్దుల్లోని గ్రామ ప్రజలు ఆసక్తిగా ఉన్నారని ఉద్యమాలు చేస్తున్నారని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అక్కడి ప్రజలు ఉద్యమానికి సిద్ధమయ్యారు. మహారాష్ట్ర పరిధిలోని ధర్మాబాద్ తాలూకా గ్రామస్తులు తమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. 

తెలంగాణలో కలుస్తామంటున్న ధర్మాబాద్ ప్రజలు

మరాఠ్వాడాలొని తెలంగాణకి అతి దగ్గర గా ఉన్న ధర్మాబాద్ తాలూకా గ్రామస్తులు తమ గ్రామాలను తెలంగాణలో విలీనం చెయాలని చాలా కాలంగా కోరుతున్నారు. ఇటీవల  మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఈ దఫా ధర్మాబాద్ కి అతి సమీపంలో ఉన్న తెలంగాణలోని గ్రామస్తులు   వారికి అండగా నిలుస్తున్నారు. తెలంగాణ, మరాఠ్వాడ లొ నివసించే వారు  కుటంబ సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఇరు రాష్ట్రాల సంక్షేమ పథకాల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోందని, తెలంగాణ వాసుల జీవితాలు సుభీక్షంగా ఉన్నాయని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలో నివసించే వారి జీవితాలు  దారిద్ర్యంలో మగ్గుతున్నాయని వారు వాపోతున్నారు. 

తెలంగాణ సర్కార్ పథకాల వల్ల ఎంతో లబ్ది కలుగుతుందని ఆకాంక్ష

తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు రైతు బంధు, రైతు భీమ, 24 గంటల ఉచిత విద్యుత్, దళిత ‌బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కల్యాణ లక్ష్మి, యంత్ర లక్ష్మీ, కెసిఆర్ కిట్, ఓవర్సీస్ విద్యా స్కాలర్ షిప్, ఉచితoగా సన్న బియ్యం పంపిణీ లాంటి పథకాలు తెలంగాణ వాసులకు రావడం, అటువంటి పథకాలు తెలంగాణకు కిలో మీటర్ దూరంలో ఉన్న మహారాష్ట్ర వాసులకు వస్తే బాగుండును అంటున్నారు.  మహారాష్ట్ర లోని  ‌తమ బంధువులకు ఎటువంటి సంక్షేమ పధకాలు రాకపోవడం చాలా బాధగా ఉందని.... మాహారాష్ట్రా లోని గ్రామస్తులతో పాటు తెలంగాణ గ్రామస్తులు కూడ వాపోతున్నారు.అలాగే కెసిఆర్  స్థాపించిన BRS పార్టీని వారు స్వాగతిస్తామంటున్నారు.  రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ పార్టీ నుంచి పోటీ చేస్తామంటున్నారు మహారాష్ట్ర వాసులు. 

ప్రభుత్వాలు స్పందించకపోతే ఉద్యమం చేస్తామంటున్న ప్రజలు 

ఇప్పటికే తెలంగాణ బార్డర్ లో ఉన్నా 30కి పైగా గ్రామాల ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో కలపాలని సీఎం కేసీఆర్ కు విన్నవించుకున్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు వారు ఆకర్షితులవుతున్నారు. రెండేళ్ల క్రితం తెలంగాణ బార్డర్ లో ఉన్న గ్రామాల ప్రజలు బోధన్ ఎమ్మెల్యే షఖిల్ కు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సైతం వారి గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలు తమ ఊళ్లను తెలంగాణలో విలీనం చేయాలని ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు  తమ గ్రామాల శివార్లలో తెలంగాణ రాష్ట్రం అనే బోర్డులు పెట్టేసుకుంటున్నారు. ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్తుందో కానీ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారినా ఆశ్చర్యోపవాల్సిన పని లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఇక ప్రియాంక గాంధీనే సూపర్ పవర్ ! తెలంగాణ కాంగ్రెస్‌లో ఆట మార్చేస్తున్న హైకమాండ్ !

Published at : 26 Nov 2022 12:46 PM (IST) Tags: Telangana Telangana Schemes Dharmabad Telangana Dharmabad Marathwada region people who want to join Telangana

సంబంధిత కథనాలు

ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!

ఇది చిన్న చూపే.! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!

TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!

Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి

Love Marriage : ఖండాలు దాటిన ప్రేమ, ఒక్కటైన తెలంగాణ అబ్బాయి, నెదర్లాండ్స్ అమ్మాయి

Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు

Waltair Veerayya Success Event :  వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు

Himanshu Heads CAsnival : ఈ కాస్నివాల్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి, ఈవెంట్ డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువు పునరుద్ధరణ- హిమాన్షు

Himanshu Heads CAsnival : ఈ కాస్నివాల్ పర్యావరణం, విద్యకు మధ్య వారధి, ఈవెంట్ డబ్బులతో నానక్ రామ్ గూడ చెరువు పునరుద్ధరణ- హిమాన్షు

టాప్ స్టోరీస్

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!

Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!