అన్వేషించండి

Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు - భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు, రద్దీగా మెట్రో స్టేషన్

Hyderabad News: వరుస సెలవులతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అటు, మెట్రో స్టేషన్లు సైతం రద్దీగా మారాయి.

Devotees Rush In Khairathabad: వరుస సెలవులు కావడంతో ఖైరతాబాద్ మహాగణపతిని (Khairatabad Mahaganesh) దర్శించుకునేందుకు శనివారం ఉదయం నుంచి భక్తులు భారీ తరలివస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్‌లో భక్తులను త్వరగా దర్శనం చేయించి ముందుకు కదిలిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. అటు, ఆకతాయిల నుంచి మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. అటు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మెట్రో స్టేషన్‌లో రద్దీ 

అటు, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ భక్తులతో కిటకిటలాడుతోంది. ఎల్బీనగర్, మియాపూర్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో మెట్రో స్టేషన్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. ఈ క్రమంలో మెట్రో అధికారులు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. టికెట్ కౌంటర్లు, ఎగ్జిట్ గేట్ల వద్ద రద్దీ పెరగకుండా చర్యలు చేపట్టారు. ప్రయాణికులను క్యూఆర్ కోడ్ టికెట్లు, కార్డు ద్వారా వేర్వేరు లైన్లలో పంపిస్తోంది. స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని.. కార్డుల్లో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. 

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉదయం నుంచీ గంటగంటకూ రద్దీ పెరుగుతుండడంతో మెట్రో యాజమాన్యం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది. గణేశుని దర్శనం కోసం వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతో పాటు ప్లాట్ ఫాం వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు.

Also Read: Mahabubabad News: 'అది నా కుక్క కాదు కాదు నాది' - పోలీస్ స్టేషన్‌కు చేరిన శునక పంచాయతీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

దేవర చెన్నై ప్రెస్ మీట్లో జాన్వీ కపూర్ స్పీచ్!దేవర చెన్నై ప్రెస్ మీట్లో జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్!దేవర చెన్నై ప్రెస్ మీట్లో అనిరుథ్ రవిచందర్ స్పీచ్!Pawan Kalyan World Record | ఏపీ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
One Nation One Election : జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం మరో అడుగు - రామ్‌నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు ఆమోదం - ఇక ఒక్క అడుగే
Waqf Amendment Bill: వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
వక్ఫ్‌ ఆస్తులపై వివాదం ఎందుకు, వక్ఫ్‌ అమెండ్‌మెంట్‌ -2024 లక్ష్యాలేంటి ?
Eluru News: బాలికలను కట్టేసి లైంగిక దాడి, ఫోటో షూట్లు! గల్స్ హాస్టల్‌లో వార్డెన్ భర్త ఘోరం
బాలికలను కట్టేసి లైంగిక దాడి, ఫోటో షూట్లు! గల్స్ హాస్టల్‌లో వార్డెన్ భర్త ఘోరం
Edible Oil Rates: వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?
వంటనూనెలపై గుడ్‌ న్యూస్ రానుందా! కేంద్రం తాజా నిర్ణయం ఏంటీ?
Embed widget