Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ముందుకు రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు!
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే నేడు అరుణ్ రామచంద్ర పిళ్లై, బుచ్చిబాబును ప్రశ్నించబోతుంది. సౌత్ గ్రూప్ నగదు లావాదేవీలపై ఆరా తీయబోతోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే భాగంగానే నేడు అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు ఈడీ ముందుకు రాబోతున్నారు. సౌత్ గ్రూప్ నగదు లావాదేవీలపై రామచంద్ర పిల్లై, బుచ్చిబాబులను విడివిడిగా విచారించునున్నారు. ఇదే కేసులో అభిషేక్, విజయ్ నాయర్ లను ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఐదు రోజులుగా కస్టడీలో ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ ల నుండి కొన్ని కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో రావ్స్ ఎవెన్యూ కోర్టులో అభిషేక్ విజయ నాయర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హాజరు పరచునుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు పురోగతిని కోర్టుకి వెల్లడించి అభిషేక్, విజయ్ నాయర్ కస్టడీ ని పొడిగించాలని కోరే అవకాశం ఉంది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శరత్ చంద్ర రెడ్డి, వినయ్ బాబు కస్టడీని ధర్మాసనం 21వ తేదీ వరకు పొడిగించింది.
రాబిన్ డెస్టిలరీస్ కు సంబంధించిన అరుణ్ రామచంద్ర పిల్లై ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుని నేడు ఈడీని విచారించబోతోంది. ఢిల్లీలో ప్రధానంగా సౌత్ లాబీ గ్రూప్ నుండి ఢిల్లీకి అక్రమంగా డబ్బు తరలించిన నగదుకు సంబంధించిన అంశాలపై వీరిద్దరినీ ఈడి అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయక్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు.. ఈ నలుగురిని కూడా ఈడి అధికారులు ప్రశ్నించారు. మొదట అదుపులోకి తీసుకున్న సమీర్ మహేంద్ర సహా మొత్తం ఐదుగురు.. ప్రస్తుతం ఈడీ అదుపులో ఉన్నారు. ఇప్పటికే వీరి నుంచి సేకరించిన ఆధారాల దృష్ట్యా అరుణ్ రామచంద్ర పిల్లై. గోరంట్ల బుచ్చిబాబును హైదరాబాద్ ఈడీ అధికారులు ప్రశ్నించారు. వారి నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించారు.
తాజాగా ఈడీ ఈ నలుగురిని ప్రశ్నించి ఆ తర్వాత
సౌత్ గ్రూపు నుంచి ముఖ్యంగా వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి అక్రమంగా తరలించారని... ఆ డబ్బును పంజాబ్ ఎన్నికల్లో ఉపయోగించారనే ఆరోపణలు వస్తున్నాయి. మద్యం పాలసీని మద్యం తయారీ కంపెనీలకి, L1 లైసెన్స్ అనుకూలంగా రూపొందించేందుకు ఈ నగదును లంచంగా వాడినట్లు సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ ఆప్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు ఈ నగదును లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రధానంగా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలోనే సమీర్, మహేందర్, శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు, విజయ నాయక్ లకు ఉన్న సంబంధం గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు రామచంద్ర పిళ్లై.. ఈ నలుగురితో నడిపిన ఆర్థిక లావాదేవీలు, ఇందుకు సంబంధించిన అంశాల పైన అలాగే సౌత్ గ్రూప్ ద్వారా మూడు కోట్ల 20 లక్షల రూపాయల వరకు నగదును ఢిల్లీకి హవాలా రూపంలో రామచంద్ర పిళ్లై పంపించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అంశాల పైన కూడా ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లై, ఆయన చార్టెడ్ అకౌంట్ గోరంట్ల బుచ్చిబాబుని ఈరోజు ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు.
నిన్న కోర్టులో విచారణ సందర్భంగా శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు విచారణ సందర్భంగా రామచంద్ర పిళ్లై , గోరంట్ల బుచ్చిబాబుని ఈరోజు ప్రశ్నించబోతున్నారు. వారి విచారణలో కూడా కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని నిన్న కోర్టులో తెలియజేశారు. ఈ వ్యవహారంలో మరికొంత మంది అరెస్టులు, విచారణలు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మొదట ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సమీర్, మహేంద్ర, ఆ తర్వాత సీబీఐ రంగంలోకి దిగి విజయ నాయక్, అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేశారు. అలాగే ఆ తర్వాత శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబు... ఇలా అరెస్టుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు అరుణ్ రామచంద్ర పిళ్లై గోరంట్ల బుచ్చిబాబు ఈడీ దర్యాప్తుకి సహకరించకపోతే వారిని సైతం ఈడీ కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది. వారిచ్చే సమాచారం ఆధారంగానే ఈ వ్యవహారంలో రాజకీయ ప్రముఖులు హస్తం ఉందా లేదా అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.