అన్వేషించండి

Kishan Reddy on CM KCR : రా రైస్ ఇస్తే చివరి గింజ వరకూ కొంటాం, రైతుల కోసం ఆ నష్టాన్ని భరించలేరా? : కిషన్ రెడ్డి

Kishan Reddy : ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ కేంద్రంపై చేసిన విమర్శలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

Kishan Reddy on Paddy Procurement : టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి వార్ రోజు రోజుకీ ముదురుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దిల్లీలో రైతు దీక్ష చేపట్టి కేంద్రం ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటమ్ ఇచ్చారు. కేంద్రం తెలంగాణ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. టీఆర్ఎస్ విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దిల్లీలో మాట్లాడిన ఆయన... సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడాలన్నారు. టీఆర్ఎస్ తెలంగాణ రైతాంగాన్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేంద్రం విద్యుత్ మోటర్లకు మీటర్లు పెట్టబోతోందని ఇందిరా పార్క్ దగ్గర ఉద్యమాలు చేశారన్నారు. మీటర్లపై కేంద్రం జీవో కానీ చట్టం కానీ తీసుకురాలేదన్నారు. ఎరువులపై కేంద్రం సబ్సిడీ తీసేస్తుందని చేసిన ఆరోపణలను రైతుల నమ్మలేదన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రానికి ఉప్పుడు బియ్యం పంపించమని తెలంగాణ ప్రభుత్వమే ఒప్పందం చేసుకుందన్నారు. 

బాయిల్డ్ రైస్ ఉచితంగా ఇచ్చినా తినట్లే 

సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుల మెడ మీద కత్తి పెట్టి బెదిరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉప్పుడు బియ్యం నిల్వలు పెరిగిపోతున్నాయన్నారు. గత మూడు నాలుగేళ్లుగా బాయిల్డ్ రైస్ వద్దని రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నాలు కేంద్రం చేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని సమస్య తెలంగాణకు ఎందుకన్నారు. ధాన్యంపై లేని సమస్యను ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ చూపిస్తోందని విమర్శించారు. బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను ఎక్కడా వినియోగించడంలేదన్నారు. బాయిల్డ్‌ రైస్‌ను ఉచితంగా పంచినా ప్రజలు తినే పరిస్థితి లేదన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని బాయిల్డ్‌ రైస్‌ సేకరణకు ఎఫ్‌సీఐ నిలిపివేసిందన్నారు. సీఎం కేసీఆర్‌ లేని సమస్యను సృష్టించి, వాస్తవాలను వక్రీకరించి ధర్నాలు చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం 

తెలంగాణ రైతు భవిష్యత్ కల్వకుంట్ల కుటుంబం చేతిలో నలిగిపోతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వేరువేరు విధానాలు లేవన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉందన్నారు. దేశంలో భూకంపం సృష్టిస్తామని కేసీఆర్ అంటున్నారు. టీఆర్ఎస్ లో భూకంపం రాకుండా చూసుకోండన్నారు. టీఆర్ఎస్ నేతలు పోటీలు పడి విమర్శిస్తున్నారన్నారు. గత సీజన్‌లో ఎఫ్‌సీఐకి 62 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇస్తామని తెలంగాణ ఒప్పందం చేసుకుందన్నారు. గత సీజన్‌లో ఇస్తామన్న బాయిల్డ్‌ రైస్‌ను రాష్ట్రం ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఇంకా 8.34 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐకి పంపలేదని కిషన్ రెడ్డి అన్నారు. బాయిల్డ్‌ రైస్‌ కాకుండా రా రైస్ సరఫరా చేస్తే కేంద్రం తీసుకుంటుందన్నారు. రా రైస్‌గా ఇస్తే చివరి గింజ వరకూ కేంద్రం కొంటుందని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రానికి రా రైస్‌ సరఫరా చేస్తే నూకల రూపంలో కొంత నష్టం వస్తుందన్నారు. రైతుల కోసం కొద్ది నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేరా అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్ సీఎం కేసీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget