Delhi CM : గవర్నర్లు కేంద్రం చేతిలో కీలు బొమ్మలు - దేశాన్ని అభివృద్ధి చేయడంపై చర్చించామన్న కేజ్రీవాల్
గవర్నర్లు కేంద్రం చేతిలో కీలుబొమ్మని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. నలుగురు ముఖ్యమంత్రులం కలిసి దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలో చర్చించామన్నారు.
Delhi CM : కేసీఆర్ మాకు పెద్దన్న లాంటి వారు అని ఢిల్లీ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. కంటి వెలుగు అద్బుతమైన కార్యకమమని ఢిల్లీ, పంజాబ్‌లో కూడా కంటి వెలుగు పథకం తీసుకువస్తామని స్పష్టం చేశారు. కొత్త కలెక్టరేట్ల నిర్మాణం ఒక అద్భుతం. కంటి వెలుగు కార్యక్రమం నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ఢిల్లీ వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. సింగపూర్, జపాన్ కన్నా మనం ఎందుకు వెనుకపడ్డామని మనకు ఏం తక్కువ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రతి గల్లీలో మొహల్లా క్లినిక్స్ ఉన్నాయి. అదే పథకాన్ని బస్తీ దవాఖాన పేరుతో తెలంగాణలో అమలు చేస్తున్నారనిగుర్తు చేసుకున్నారు.
నలుగురు సీఎంల దేశాభివృద్ధిపై చర్చించాం
సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి మొహల్లా క్లినిక్‌లను చూశారు. తెలంగాణ గవర్నర్.. కేసీఆర్‌ను ఇబ్బంది పెడుతున్నారు. ప్రధాని మోదీ ఆదేశాలతోనే గవర్నర్ తమిళసై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారు. గవర్నర్లు కేవలం కీలుబొమ్మలు మాత్రమే. అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీలో స్కూల్ కార్యక్రమాలను స్టాలిన్ పరిశీలించారు. మేం ఒకరి నుంచి ఒకరం నేర్చుకుంటున్నామని కేజ్రీవాల్ తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చేయడం ఎలా.. రైతులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేయాలనే దానిపైన ఇవాళ ముఖ్యనేతలందరం కలిసి చర్చించామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. తమిళనాడులోనూ పాఠశాలలు బాగు చేసుకున్నారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు కూడా ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారని గుర్తు చేశారు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్కూళ్లు ఎందుకు బాగోలేవు !
కేరళలో విద్యాసంస్థలు అద్భుతంగా ఉన్నాయని, అలాంటి పరిస్థితి దేశంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందన్నారు. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులకు అడ్గుతగలడమే గవర్నర్ల పని అన్నట్లు ఉందని కేజ్రీవాల్ అన్నారు. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలుగా మారారని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు దాటినా దేశం ఇంకా వెనుకబడే ఉంది. కేరళలో విద్య వైద్యం బాగుంది. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు బాగాలేదు. గవర్నర్లను సీఎంల మీదికి కేంద్రం పంపిస్తోంది. మన తర్వాత స్వాతంత్ర్యం పొందిన సింగపూర్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని గుర్తు చేశారు.
మన తర్వాత స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశాలు అభివృద్ధి
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్ దూసుకెళ్తోంది. మనమేం పాపం చేసుకున్నామని వెనుకబడిపోతున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది. 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బీజేపీని తరిమికొట్టాలి’ అని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేజ్రీవాల్ ప్రసంగానికి సభకు హాజరైన వారి నుంచి మంచి స్పందన లభించింది.
బీజేపీపై కేసీఆర్ పోరాటానికి మద్దతు - కేరళలో తెలంగాణ పథకాలు అమలు చేస్తామన్న సీఎం విజయన్ !