అన్వేషించండి
Telangana Good News: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 2023 జనవరి 1 నుంచి వర్తింపు
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం డీఏ పెంచుతూ శుభవార్త చెప్పింది. తాజాగా పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుందని ఉత్తర్వులలో పేర్కొంది.

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు, 2023 జనవరి 1 నుంచి వర్తింపు
Source : PTI
హైదరాబాద్: తెలంగాణలోని ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం చొప్పున డీఏ పెంచుతూ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పెంచిన డీఏ(Dearness Allowance) 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగుల డీఏ 26.39 శాతం నుంచి 30.03 శాతానికి పెరిగింది.

ఇంకా చదవండి






















