By: ABP Desam | Updated at : 14 Dec 2022 05:50 PM (IST)
ఏ-1 సునీల్ కనుగోలే - ఆయనకూ నోటీసులిస్తామంటున్న పోలీసులు
Congress Vs TRs : మహిళల్ని కించ పరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఏ-1 కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలునేనని హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఆయనకూ నోటీసులు జారీ చేస్తామన్నారు. మహిళలను కించపరిచేలా పోస్టులు చేస్తున్నారని సైబరాబాద్ జాయింట్ సీపీ గజరావ్ భూపాల్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని సునీల్ కనుగోలు కార్యాలయం నుంచే పోస్టింగ్‌లు పెడుతున్నారని చెప్పారు. చట్టప్రకారమే తాము నడుచుకున్నామన్నారు. ముందుగా నోటీసులు ఇచ్చి కేసులు పెట్టామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శ ఆరోగ్యకరమన్నారు. మహిళలపై అసభ్యకర పోస్ట్లు పెట్టడం విమర్శ కిందకు రాదని గజరావు భూపాల్ స్పష్టం చేశారు.
అంతగా రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే అసలైన పేర్లతో చేసుకోవచ్చని.. వారి అడ్రస్ చెప్పుకునే విధంగా ఉండాలన్నారు. తెలంగాణ గళం, భారతీయ యువకుడు అనే పేర్లతో పోస్టులు ఉన్నాయన్నారు. ఈ వ్యవహారంలో మొత్తం ముగ్గురిని అరెస్ట్ చేశామని.. వారు .. తాము సునీల్ కనుగోలు చెబితేనే వీడియోలు మార్ఫింగ్ చేశామని చెప్పారని జాయింట్ సీపీ చెప్పారు. అందుకే ఆయనను ఏ-1 చేర్చామన్నారు. మరో వైపు సునీల్ కనుగోలు ఆఫీస్ తనిఖీలపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టు ను ఆశ్రయించింది. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురు ఉద్యోగ జాడ తెలియడం లేదని పిటిషన్‌లో పేర్కొంది. ముగ్గురి కోసం హేబియస్ కార్పస్ పిటిషన్‌ను మాజీ ఎంపీ మల్లు రవి దాఖలు చేశారు. కనీస సమాచారం లేకుండా ముగ్గురిని పట్టుకెళ్లారని పిటిషన్‌లో తెలిపారు.
మరో వైపు అది సునీల్ కనుగోలు ఆఫీస్ కాదని.. కాంగ్రెస్ పార్టీ ఆఫీసేనని.. తమ పార్టీ వార్ రూమ్ అని.. ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఢిల్లీ స్థాయిలో ఆందోళన నిర్వహిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, ఎంపీ మాణిగం టాగూర్ ఈ అంశాన్ని పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించారు. వాయిదా తీర్మానం ఇచ్చారు. ఆ పార్టీ సీనియర్ నేత పవన్ ఖేరా.. కేసీఆర్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి స్థాయిలో చట్టాలను ఉల్లంఘించి.. నియంత పాలన చేస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ముట్టడించారు. పదుల సంఖ్యలో కాంగ్రెస్ నేతల్ని అరెస్ట్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం అంశంపై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెడుతున్నారు. అయితే కాంగ్రెస్ నే టార్గెట్ చేయడం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ వార్ రూం కేంద్రంగా కేవలం సోషల్ మీడియా పోస్టులు మాత్రమే తమ సిబ్బందికి అసైన్ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం స్ట్రాటజీలన్నీ అక్కడే సిద్ధమవుతున్నాయి. సర్వేలు, క్రేత్ర స్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని కూడా అక్కడే విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో డేటా తస్కరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఉమ్మడి ఆస్తులు తెలంగాణ ప్రభుత్వం పంచట్లేదు - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ !
Breaking News Live Telugu Updates: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా?: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Nizababad Politics: కారు దిగి సైకిల్ ఎక్కనున్న మాజీ మంత్రి - త్వరలో టీడీపీలో చేరనున్న మండవ !
Kondagattu Temple: కొండగట్టు ఆలయాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు - థాంక్స్ చెప్పిన ఎమ్మెల్యే
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
CBI Letter To Telangana CS : ఫామ్ హౌస్ కేసు వివరాలివ్వాలని ఐదు సార్లు సీబీఐ లేఖలు - పట్టించుకోని తెలంగాణ సీఎస్ !
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్‌న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ