Suravaram Sudhakar Reddy Passes Away: సీపీఐ కురువృద్ధుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత.. రెండుసార్లు ఎంపీగా సేవలు.. జాతీయ స్థాయి నేతల సంతాపం
రెండుసార్లు ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మరణంతో సీపీఐ పెద్ద దిక్కును కోల్పోయింది.

Suravaram Sudhakar Reddy Cpi Leader Died : కమ్యూనిస్ట్ యోధుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... శుక్రవారం హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. కమ్యూనిస్టూ పార్టీ తరపున తను రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1998, 2004లో లోక్ సభ సభ్యునిగా సేవలు అందించారు. అలాగే సీపీఐ ప్రధాన కార్యదర్శిగాను పని చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942లో జన్మించిన ఆయన విద్యార్థి దశ నుంచే వామపక్ష ఉద్యమాలపై ఆసక్తితో.. సీపీఐలోకి ప్రవేశించారు. ఈయన తండ్రి వెంకట్రామిరెడ్డి..స్వాతంత్ర యోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్‌రెడ్డి కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టాపొందారు. 1974లో విజయలక్ష్మిని వివాహం చేసున్నారు. వారికి ఇద్దరు కుమారులు.రెండు సార్లు నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికై ప్రజా సేవ చేశారు. 2012లో సీపీఐ జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి, విశేష సేవలు అందించారు.
🇮🇳🚩 Suravaram Sudhakar Reddy, Secrétaire général du Parti Communiste d'Inde (2012-2019), est décédé.
— Perspective communiste ☭🔻 (@PerspCommuniste) August 22, 2025
Il a consacré toute sa vie aux luttes ouvrières, aux luttes pour les droits des opprimées et à la construction du socialisme en Inde.
Que la terre te soit légère camarade. pic.twitter.com/JlL0ni3zdd
పోరాటాల్లో ముందుండి..
సుదీర్ఘ కాలం పాటు సీపీఐలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించి, ఆ పదవికే వన్నె తెచ్చారు. ఈ పదవిలో ఉన్నంతకాలం పార్టీ బలోపేతానికి కృషి చేశారు. రైతాంగం, కార్మిక సంఘాల పోరాటాల్లో ముందు వరుసలో నడిచి, సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృష్టి చేశారు. వామపక్ష శక్తుల ఏకీకరణ కోసం కూడా ఆయన పరితపించారు. సామాజిక సమస్యలపై లోతైన ఆలోచన కలిగిన మేధావి అని విమర్శకులు ప్రశంసిస్తారు. ప్రజల పక్షాన నిలిచి, గ్రామీణ అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల మెరుగుదలకు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమానికి మాత్రమే కాదు, దేశ రాజకీయాలకు కూడా అపూర్వ నష్టం అని సహచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీలు పెద్ద దిక్కును కోల్పోయాయని పలువురు అభివర్ణిస్తున్నారు.
కీలక కమిటీల్లో..
1998-99 సంవత్సరాల్లో సురవరం సుధాకర్ రెడ్డి మానవ వనరుల అభివృద్ధి కమిటీ కింద పనిచేసే ఔషధ ధర నియంత్రణ ఉప కమిటీలో సభ్యునిగా విశేష సేవలు అందించారు. అదే సమయంలో ఆయన ప్రభుత్వానికి చెందిన అనేక సలహా బృందాలలో కూడా తనవంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఏర్పాటైన సలహా కార్యవర్గంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇలా తనకు తోచిన రీతిలో పలు సేవలు అందించి, రాజకీయాల్లో అజాత శత్రువుగా నిలిచాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన యాక్టివ్ గా లేరు. తాజాగా





















