అన్వేషించండి

Warangal Cyclone Montha: గోదావరి జిల్లాలను భయపెట్టి వరంగల్‌ను అతలాకుతలం చేసిన మొంథా - సహాయచర్యలపై సీఎం రేవంత్ సమీక్ష

CM Revanth: సైక్లోన్ మొంథా ప్రభావంతో వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు.

CM Revanth reviews the impact of Cyclone Montha in Warangal:  గోదావరి జిల్లాలను వణించిన తుఫాన్ మొంథా అనూహ్యంగా తెలంగాణ వైపు రావడంతో  వరంగల్ జిల్లాలో అత్యధిక వర్ఘాలు కురిశాయి. 40 సెంటిమీటర్లకుపైగా వర్షం పడటంతో జనజీవనం స్తంభించింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల పరిస్థితిపై సమీక్ష చేశారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం జరగకుండా చూడాలని, పశువులకు ఆపద రాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ముంపు గ్రామాలు, కాలనీల్లో ఉంటున్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తగిన సహాయం అందించాలని ఆదేశించారు. 

తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధానంగా వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు.  ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతో పాటు, హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద నష్టం ఎక్కువగా ఉందని అంచనాకు వచ్చారు. అన్ని చోట్ల వరి కోతలు మొదలయ్యాయని, అనుకోని ఉపద్రవం ఏది వచ్చినా రైతులకు ఆవేదన మిగులుస్తుందని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఈసారి 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్లుగా పౌరసరఫరాల విభాగం కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. 

వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవటం రైతులు నష్టపోవటం ఆందోళన కలిగించిందని అన్నారు. కళ్లాల్లో, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లుల, గోదాములు అందుబాటులో లేని చోట దగ్గరలో ఉన్న ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికో ఇన్ఛార్జీ అధికారిని నియమించాలని, ఇప్పుడున్న ఇన్ఛార్జీలు నిర్లక్ష్యంగా ఉంటే వెంటనే వేరే వాళ్లను నియమించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రతీ ఐకేపీ సెంటర్ నుంచి ఏరోజుకారోజు సాయంత్రం రిపోర్టు తెప్పించుకోవాలని, రిపోర్ట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను అప్రమత్తం చేశారు. అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసి అందరూ  క్షేత్రస్థాయిలో పర్యటించేలా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. 

వర్షాలకు ధాన్యం తడవకుండా తగినన్ని టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలి. విధానపరమైన నిర్ణయాలు అవసరమైతే వెంటనే సివిల్ సప్లయిస్ కమిషనర్, సీఎస్ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.  వరద తగ్గిన తర్వాత వ్యవసాయ, రెవిన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి నష్టపు అంచనాలు తయారు చేయాలని నివేదించారు. తుఫాను, వర్షాల ప్రభావమున్న జిల్లాల్లో చేపడుతున్న సహాయక చర్యలు, రోడ్లు, రహదారుల పునరుద్ధరణ చర్యలు  ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లా ఇంచార్జ్ మంత్రులు సమీక్షించాలని సీఎం కోరారు. తమ సొంత జిల్లాల్లో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, ఇన్ఛార్జీగా ఉన్న జిల్లాల్లో ప్రజలను ఆదుకునే చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని చెప్పారు. 
 
రాష్ట్రంలో 16 జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు.   వర్షాలతో ఖమ్మం జిల్లాలో ఒక డీసీఎం వ్యాన్, డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు. అన్ని రోడ్లు, రహదారులపై ఉన్న బ్రిడ్జిలు, లో లెవల్ కాజ్ వేలు, కల్వర్టుల వద్ద అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని సీఎం అన్నారు.  వరంగల్ లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా  పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా టీమ్లను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. వరంగల్లో తక్షణ సహాయక చర్యలకు అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీకి ఆదేశించారు.హైదరాబాద్ నుంచి హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  

వరంగల్లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ హెల్ప్ సెల్ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలోనూ కమాండ్ కంట్రోల్ సెంటర్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వర్షాలు, వరదలు, విపత్తులు వచ్చినప్పుడు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. 
 
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి  శుక్రవారం ఉదయం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు. గురువారం ఉదయమే వరద ప్రభావిత జిల్లాలకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారు. ఆఖరి నిమిషంలో సీఎం పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవటంతో హెలికాప్టర్ ప్రయాణం వీలు కాదని ఏరియల్ సర్వేకు అధికారులు అనుమతించలేదు. ఈరోజు వాతావరణం అనుకూలించకపోవటంతో తాను రాలేకపోయానని, శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేకు వస్తానని వీడియో కాన్ఫరెన్స్లో సీఎం ప్రకటించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Advertisement

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత విచిత్రమైన ఆచారాలు పాటించే ఉడిపి శ్రీకృష్ణ మందిరం
Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Sa 3rd t20 highlights: మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
మూడో టీ20లో భారత్ ఘన విజయం.. బౌలర్లు భేష్, ఆపై అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్
Trending Jobs In 2025: ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
ఈ ఉద్యోగాలకు ఏడాది పొడవునా డిమాండ్.. మార్కెట్లో ఈ రంగాలకు తగ్గని ఆదరణ
Sahana Sahana Song : 'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
'ది రాజా సాబ్' నుంచి కూల్ మెలోడి సాంగ్ - 'సహానా సహానా' ప్రోమో చూశారా?
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Movie Shootings Famous Tree: సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
సినిమా చెట్టు బతికిందోచ్.. ప్రాణం పెట్టి కాపాడితే రిజల్ట్ ఎలా ఉందో చూశారా..
Hardik Pandya Records: చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. ప్రపంచంలో తొలి ఆల్ రౌండర్‌గా అరుదైన ఘనత
Ind u19 vs Pak u19 highlights: ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. 90 పరుగులతో ఘన విజయం
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
Embed widget