అన్వేషించండి

CM Revanth Reddy Gumpu Mestri Speech: అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Revanth Reddy Taxes and Income Raise : తనను గుంపు మేస్త్రీ పేరుతో ఎగతాళి చేస్తున్న వారికి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మంత్రులు, ప్రజలు .. ఇలా గుంపులకు తాను మేస్త్రీనేనని తన వద్ద దొరక పోకడల్లేవన్నారు.

Telangana Government Employees Insurance MoU:   తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్  ఒప్పంద కార్యక్రమం హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరిగింది. ఈ అధికారిక వేదికపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన మార్క్ రాజకీయ ప్రసంగంతో విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను నిరంతరం గుంపు మేస్త్రీ అని విమర్శించే నేతలకు కౌంటర్ ఇస్తూ..  "అవును.. నేను గుంపు మేస్త్రినే, నన్ను చాలామంది అలా అవహేళన చేస్తుంటారు.. దానికి నేను ఏమాత్రం ఫీల్ కాను"  అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ గుంపంతా  నా మంత్రులు, నా ఉద్యోగులు, నా ప్రజలు  నాదేనని, ఈ గుంపే తన బలమని, తన ప్రతిష్ట అని ఆయన సగర్వంగా ప్రకటించారు.
 
 మా దగ్గర  దొరల  పోకడలు లేవు.. గత పాలకులపై సీఎం ఫైర్! 

గత పాలకుల ఫ్యూడల్ మనస్తత్వాన్ని ఎండగడుతూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది తాము చాలా గొప్పవాళ్లమని, తాము దొరలమని ఇళ్లల్లో కూర్చుని గొప్పలు చెప్పుకుంటారు.. అలాంటి అహంకారపూరిత, దొరల పోకడలు నా దగ్గర లేవు అని స్పష్టం చేశారు. తానే స్వయంగా ఒక సాధారణ స్థాయి నుండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని కాబట్టే.. ప్రజల కష్టాలు, ఉద్యోగుల బాధలు తనకు తెలుసన్నారు. సచివాలయానికి రాకుండా ప్రగతి భవన్, ఫామ్‌హౌస్‌లకే పరిమితమైన కాలం పోయిందని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ఇదని ఆయన గుర్తుచేశారు. 

 ఉద్యోగులకు సీఎం పిలుపు  రోజుకో గంట అదనంగా పని చేద్దాం! 

తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.  రాష్ట్ర సంక్షేమం కోసం మనం రోజుకో గంట అదనంగా పని చేద్దాం  అంటూ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. పన్నులు కట్టకుండా, లూప్‌హోల్స్ వాడుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిని పట్టుకునే బాధ్యత ఉద్యోగ యంత్రాంగంపైనే ఉందన్నారు. పారదర్శకంగా పన్నుల వసూళ్లను పెంచి, రాష్ట్ర ఆదాయాన్ని వృద్ధి చేయాలని, అలా పెరిగిన ఆదాయాన్ని తిరిగి ఉద్యోగుల ప్రయోజనాలకు, ప్రజా సంక్షేమానికే ఖర్చు పెడతానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

  
 ఉద్యోగుల ఇన్సూరెన్స్ ఒప్పందం ఒక అపూర్వ ఘట్టం! 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఇన్సూరెన్స్ ఒప్పందాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుదుర్చుకుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య బీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు   వెల్లడించారు. ఉద్యోగులు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా, పూర్తి ఆరోగ్యంతో విధుల్లో పాల్గొనడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం పేర్కొన్నారు. ఈ ఎంఓయూ ద్వారా వేలాది మంది సచివాలయ, జిల్లా స్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
2026 ఆగష్టు 15 తర్వాత ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్ సెగ? Gen Z , ప్రతిపక్షం దూకుడు!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Embed widget