అన్వేషించండి

Greater City Corporation: గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్ - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

CM Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Orders To Implement Hyderabad Greater City Corporation: హైదరాబాద్ (Hyderabad)లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను.. హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఆవిష్కరించేందుకు సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం సమీక్షలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని శివారును ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని నిర్దేశించారు. HMDA పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు కసరత్తు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాలను ఒకేసారి అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. 

అధ్యయనం ఇలా!

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో 150 డివిజన్లు ఉన్నాయి. కోటికి పైగా జనాభా ఉంది. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో దాదాపు 60 లక్షల మంది వరకూ జనాభా ఉంటుందని అంచనా. విలీనం తర్వాత జనాభా 1.80 కోట్ల నుంచి 2 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు వేస్తున్నారు. విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ గా ఒకటిగా ఏర్పాటు చేయాలా.? లేక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం ఇలా వేర్వేరుగా 4 సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా.? అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కాగా, హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకూ విస్తరించాలని ఇటీవల సమీక్షలో నిర్దేశించారు. 

ఎందుకిలా.?

జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని డివిజన్లలో లక్ష మందికి పైగా జనాభా ఉంటే, మరికొన్ని కార్పొరేషన్లలో డివిజన్లలో 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఒకే తీరుగా జరుగుతుందనేది అధికారుల అంచనా. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర వాటి కోసం భారీగా నిధులు వెచ్చించాలని వారు సీఎం దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలో అన్ని డివిజన్లకు జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని.. దీనిపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దాదాపు సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని.. నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై అధ్యయనం చేయాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందట అక్కడి 3 మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్ గా విలీనం చేసింది. అక్కడ అనుసరించిన విధానాలను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రత్యేకాధికారులు అప్పుడే

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తైన వెంటనే వాటికి ప్రత్యేకాధికారులను నియమించాలని, అన్నింటి పదవీ కాలం ముగిసిన తర్వాతే ఈ విలీన ప్రక్రియ ప్రారంభించాలని సీఎం రేవంత్ అధికారులతో సమాలోచనలు చేశారు. జీహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ్ పేట, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వాటితో పాటు 30 మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. వాటి పాలకవర్గాల పదవీ కాలం మరో ఏడాది ఉంది. ఆ తర్వాతే ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు.

Also Read: Telangana News: త్వరలో రైతు, విద్యా కమిషన్లు ఏర్పాటు- సీఎం రేవంత్ కీలక ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget