CM KCR: సూర్యాపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభించిన సీఎం కేసీఆర్
CM KCR's visit to Suryapet district: సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
CM KCR's visit to Suryapet district: సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సూర్యాపేట జిల్లాకు తీసుకువచ్చిన సందర్భంగా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికల ముందు మొదటి సభ కావడంతో విద్య శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో 100 ఎకరాల్లో పెద్ద ఎత్తున సభకు ఏర్పాట్లు చేశారు.
సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ నుంచి సూర్యాపేట చేరుకున్న సీఎం కేసీఆర్ ముందుగా రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటిగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను ప్రారంభించి అందుబాటులోకి తీసుకొచ్చారు. మార్కెట్‌లో కాసేపు కలియతిరిగి దాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా నూతన బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు బొల్లం మల్లయ్య యాదవ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
కాగా, సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా రహదారులన్నీ గులాబీయమయ్యాయి. సీఎం కేసీఆర్ కటౌట్లు, పార్టీ తోరణాలతో సూర్యాపేట జిల్లా కేంద్రం మొత్తం గులాబీమయంగా మారింది. సీఎం పర్యటన సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు వచ్చే వారితో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఆయా ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూర్.ఎస్, చివ్వెంలతోపాటు మోతె, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వచ్చే వారి కోసం నూతన వ్యవసాయ మార్కెట్, అంబేద్కర్ గ్రౌండ్‌లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పెన్‌పహాడ్ మండలంతోపాటు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల నుంచి వచ్చే వారి కోసం సుధాకర్ పీవీసీ సమీపంలోని రహదారి మీదుగా నూతన వ్యవసాయ మార్కెట్ తూర్పు వైపు ఉన్న ఓపెన్ ప్లేస్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. వీఐపీలకు మాత్రం బహిరంగ సభ జరిగే డయాస్ వెనుకాల ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించారు. అక్కడ జిల్లా ఎస్పీ ఛాంబర్‌లో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను కూర్చొబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ ప్రత్యేక పూజలో పాల్గొని సర్వమత ప్రార్థనలు చేశారు. కలెక్టర్ వెంకట్రావును ఛాంబర్‌లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అధికారులతో సమావేశం అనంతరం సూర్యాపేట నూతన మార్కెట్ సమీపంలో మంత్రి జగదీశ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు బయల్దేరారు.