Breaking News Live: నరేంద్ర మోదీ జాగ్రత్త, దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు నేను సిద్ధం: కేసీఆర్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. ప్రస్తుతం ఇక్కడ సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చలి ప్రభావం తగ్గనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రెండు రాష్ట్రాల్లోనూ నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా ఏపీ మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇతర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగుతుంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేదు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో వాతావరణం కాస్త వేడిగా మారనుంది. వర్ష సూచన లేకపోవడంతో రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని అధికారులు పేర్కొన్నారు.
చలి కాలం ముగిసింది కనుక రాత్రులు ఏపీలో వెచ్చగా ఉంటుంది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో వెచ్చటి రాత్రులు, రాయలసీమ జిల్లాల్లో మాత్రం కాస్తంత చల్లగా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని రోజులపాటు వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం లేనందున మధ్యాహ్నం వేడి పెరుగుతుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. కిందటి రోజుతో పోల్చితే కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని రోజుల కిందటి వరకు 18 డిగ్రీల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో నమోదు కాగా.. రెండు మూడు రోజుల్లో కనిష్ణ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు దాటే అవకాశం ఉందని అంచనా వేశారు.
తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో నేడు సైతం ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో పలు చోట్ల జల్లులు పడే అవకాశం ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. వర్ష ప్రభావం లేని చోట కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు కూడా పెరిగింది. గ్రాముకు రూ.25 చొప్పున ఎగబాకింది. వెండి ధర మాత్రం నేడు నిలకడగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,800 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,970 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.66,800గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.66,800 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,800 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,970గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.66,800గా ఉంది.
KCR On Modi : నరేంద్ర మోదీ జాగ్రత్త, దిల్లీ కోట బద్దలు కొట్టేందుకు నేను సిద్ధం: కేసీఆర్
దిల్లీ కోట బద్దలు కొట్టేందు నేను సిద్దం.. నరేంద్రమోదీ జాగ్రత్త అంటూ హెచ్చరించారు తెలంగాణ సీఎం కేసీఆర్
ఎమ్మెల్సీ అశోక్ బాబుకి బెయిల్ నిరాకరించిన హైకోర్టు
ఎమ్మెల్సీ అశోక్ బాబుకి హైకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అశోక్ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి అశోక్ బాబును అరెస్ట్ (TDP MLC Ashok Babu Arrest) చేసిన అధికారులు గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఉద్యోగ సమయంలో విద్యార్హతలు తప్పుగా చూపించారని అరోపణలున్నాయి. పదోన్నతి సమయంలోనూ విద్యార్హతలు తప్పుగా చూపించారని అభియోగాలున్నాయి. ఈ క్రమంలో సీఐడీ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు.
TDP Leader Ashok Babu Arrest: అశోక్‌బాబుకు బెయిల్ నిరాకరించిన హైకోర్టు
ఎమ్మెల్సీ అశోక్ బాబుకి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు..
అశోక్ బాబుపై థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ప్రభుత్వానికి తగదు: హరిప్రసాద్
ఎమ్మెల్సీ అశోక్ బాబును అక్రమంగా అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించడం ఏపీ ప్రభుత్వానికి తగదని, ఆయనకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతోందని, సీఎం జగన్ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారన్నారని కడప నగరంలోని టీడీపీ ఆఫీసులో మాట్లాడారు. నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఆందోళన చేస్తుంటే వారిని అక్రమ అరెస్టుల చేయడం హేయనీయమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నప్పటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, నిరుద్యోగులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.
జనగామ కలెక్టరేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి జనగామ కలెక్టరేట్ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వివిధా కళా రూపాల్లో కళాకారులు ఆయనకు స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. కొత్తగా నియమించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.