By: ABP Desam | Updated at : 13 Mar 2023 11:00 AM (IST)
ఆస్కార్ అవార్డులతో కీరవాణి, చంద్రబోస్
విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ, ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం తెలుగువారిగా మనందరికీ గర్వకారణమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ‘నాటు నాటు' పాట కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.
ఆస్కార్ అవార్డు పొందిన నాటు నాటు పాటలో పొందుపరిచిన పదాలు.. తెలంగాణ సంస్కృతికి, తెలుగు ప్రజల రుచి అభిరుచికి, ప్రజా జీవన వైవిధ్యానికి అద్దం పట్టాయని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలుగు భాషలోని మట్టి వాసనలను, ఘాటును, నాటు పాట ద్వారా గొప్పగా వెలుగులోకి తెచ్చిన పాట రచయితను సీఎం ప్రత్యేకంగా కొనియాడారు. నాటి ఉమ్మడి వరంగల్ నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని చల్లగరిగె గ్రామ బిడ్డ చంద్రబోస్ ను సీఎం మనసారా అభినందించారు.
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి, పాట కూర్పులో భాగస్వాములైన దర్శకుడు రాజమౌళి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమా నిర్మాత డివివి దానయ్య, ఇతర సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
నిర్మాణ విలువల పరంగాను, సాంకేతికంగాను హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో చిత్రాలు రూపొందుతుండటం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆస్కార్ అవార్డుతో తెలంగాణ కేంద్రంగా, హైదరాబాద్ గడ్డమీద దినదినాభివృద్ధి చెందుతున్న తెలుగు సినిమా పరిశ్రమ కీర్తి దిగంతాలకు వ్యాపించిందని సీఎం ప్రశంసించారు. ఈ అవార్డు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లకే కాకుండా, తెలుగు, ద్రావిడ భాషలకు, యావత్ భారత దేశానికి గర్వకారణం అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగు సినీ ప్రేక్షకులకు ఇది పండుగరోజనీ, తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వ కృషి ఫలించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధి, విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటునందిస్తున్నదనీ, కరోనా కాలంలో కష్టాలు చుట్టిముట్టిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ అవార్డు స్ఫూర్తితో తెలుగు సినిమా పరిశ్రమ భవిష్యత్తులోనూ ఇదే ఒరవడిని కొనసాగించాలని, వైవిద్యంతో కూడిన కథలతో, ప్రజా జీవితాలను ప్రతిబింబించే సినిమాలు మరిన్ని రావాలని, సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని అభినందనలు
మరోవైపు నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు సాధించిన సందర్భంగా RRR చిత్ర యూనిట్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాభినందనలు తెలిపారు. ఈ గీతాన్ని రచించిన తెలంగాణ ముద్దుబిడ్డ చంద్రబోస్ ఆలాపించిన సినీ కళామతల్లి ముద్దుబిడ్డలు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ లకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాహుబలి సినిమాతో తెలుగు సినీ ప్రస్థానాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెలుగుజాతి విప్లవ వీరులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులకు అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని తీసుకురావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ గేయానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఆస్కార్ బరిలో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ కేటగిరిలో గెలిచి నిలిచిన మరో చిత్రం ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర యూనిట్‌ని కూడా ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు.
Chandrababu: నేను కట్టిన హైటెక్ సిటీని YSR కూల్చింటే అభివృద్ది జరిగేదా?: చంద్రబాబు
Chandrababu Speech: పసుపు ఎక్కడ ఉంటే అక్కడ శుభం - చరిత్ర ఉన్నంతవరకు టీడీపీ ఉంటుంది: చంద్రబాబు
Ambedkar Statue: దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ప్రత్యేకతలేంటో తెలుసా?
TSPSC AEE Exam: ఏఈఈ నియామక పరీక్షల షెడ్యూలు ఖరారు, సబ్జెక్టులవారీగా తేదీలివే!
Balakrishna About NTR: నా తండ్రి ఎన్టీఆర్ కు మరణం లేదు, రాజకీయాల్లో విప్లవం తెచ్చారు: బాలకృష్ణ
Supreme Court Notice To CM Jagan : సాక్షి పత్రిక కొనుగోలుకు వాలంటీర్లకు ప్రజాధనం - సీఎం జగన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు !
PS2 Telugu Trailer: వావ్ అనిపించే విజువల్స్, మైమరపించే మ్యూజిక్ - ‘పొన్నియిన్ సెల్వన్ 2’ ట్రైలర్ వచ్చేసింది!
Sri Rama Navami Wishes In Telugu 2023: మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
Priyanka Chopra Comments on RRR: ‘ఆర్ఆర్ఆర్’ తమిళ సినిమా అట, ప్రియాంక చోప్రాను తిట్టిపోస్తున్న జనం