IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT
IPL, 2022 | Match 68 | Brabourne Stadium, Mumbai - 20 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
CSK
CSK

Breaking News Live: ఆంధ్రప్రదేశ్‌లో IAS బదిలీలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
AP News: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ల బదిలీలు

మంత్రివర్గ విస్తరణ పూర్తైంది... కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆయా శాఖలకు ఎవరు ఫిట్‌ అవుతారో అన్న విధానంలో రాష్ట్రంలో ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంటీ కృష్ణబాబును నియమించింది. దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్‌ను తీసుకొచ్చింది. .

APSRTC Charge Hike: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీలో ఛార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఛార్జీలు పెంచు ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. డీజీల్ సెస్‌ పేరుతో పెంచుతున్నట్టు తెలిపారు ఆర్టీసీ ఛైర్మన్‌. పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే వాళ్లకు రెండు రూపాయలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌ బస్సలపై ఐదు రూపాయలు భారం వేశారు. హై అండ్‌ బస్సులపై పది రూపాయలు వడ్డించారు. దీంతోపాటు పల్లెవెలుగు, ఇతర బస్సుల్లో కనీస ఛార్జ్‌ను పది రూపాయలు చేశారు. 

AP Minister RK Roja: సీఎం జగన్ నమ్ముకాన్ని వమ్ము చేయను: మంత్రి ఆర్కే రోజా

AP Minister RK Roja: అమరావతి... ఆర్కే రోజా టూరిజం శాఖ మంత్రిగా సెక్రటరియేట్ లో బాధ్యతలు స్వీకరించారు. పార్టీ పెట్టక ముందు నుంచి వైఎస్ జగన్ అడుగు జాడల్లో నడిచానని, మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్ సైనికుల్లా పని  చేస్తాం అన్నారు. మంత్రి వర్గంలో ఈక్వేషన్స్ బేస్ చేసి  కేటాయింపులు చేశారు. జగన్ లాంటి నేతతో కలిసి నడవడం మా అదృష్టం. జగన్ పాలన చూసి అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయి. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మంత్రి రోజా ఇంకా ఏమన్నారంటే.. ‘సీఎం జగన్ నమ్ముకాన్ని వమ్ము చేయను. రాష్ట్రంలో ఉన్మ వనరులను  ఉపయోగించి అభివృద్ధి చేస్తాం. సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తాం. దేశ విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో నిర్మిస్తాం. క్రీడలను కూడా అభివృద్ధి చేస్తా. గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తాం. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తాం. ఆర్టిస్ట్ గా కళాకారుల సమస్యలు నాకు తెలుసు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటాం. గండికోట నుంచి బెంగుళూరుకు టూరు కోసం  సంతకం చేస్తా’ అన్నారు.

Kollu Ravindra On CM YS Jagan: మంత్రులను డమ్మీలు చేసిన ఘనత జగన్‌దే: కొల్లు రవీంద్ర

Kollu Ravindra On CM YS JAgan: కర్నూలు : వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని టీడీపీ బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్యాక్ బోన్ అని చెప్పిన ఆయన అదే బ్యాక్ బోన్ విరిగేలా చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో తీవ్ర అన్యాయం జరిగింది. పేరుకే 56 కార్పొరేషన్లు ఏర్పాటు.. కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు, బీసీలకి ఒక్క పైసా ఇవ్వలేదు అని ఆరోపించారు. ఈ మూడేళ్ళలో మంత్రులకు వారి శాఖలు గురుంచి వారికే తెలియకుండా డమ్మీలను చేశారని, ఇదేనా పాలన అని ప్రశ్నించారు.  

‘గతంలో ఫెడరేషన్ల ధ్వారా 30 లక్షల చొప్పున నిధులు ఇచ్చాము. కానీ ఇప్పుడు జీవో నెం 217 ఇచ్చి మత్స్యకారుల పొట్ట కొడుతున్నారు. 217 జీవోకు వ్యతిరేకంగా 18న కర్నూలులో దీక్ష చేస్తున్నాము. బీసీ సంఘాలు అన్నీ ఏకం చేసి.. జీవో రద్దు అయ్యేవరకు పోరాడుతాం. మంత్రి అప్పలరాజు తన పదవి కాపాడుకోవడం కోసం కాళ్ల బేరానికి వెళ్తున్నారు. మంత్రులను రబ్బరు స్టాంపులుగా మార్చేశారు జగన్. ప్రజలకు అండగా ఉండి టీడీపీ పోరాటాలు ఉదృతం చేస్తుందని’ కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

Drugs Caught In Visakhapatnam: విశాఖలో డ్రగ్స్ స్వాధీనం, ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Drugs Caught In Visakha: విశాఖలో డ్రగ్స్‌ మరోసారి కలకలం రేపాయి. పోలీసులు 54 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఏపీలో గంజాయి, స్మగ్లింగ్ వివాదం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. 

Kuppam Dravidian University: కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పూర్వ విద్యార్థుల ఆందోళన

Protest At Kuppam Dravidian University: చిత్తూరు : కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో కొన్ని కోర్సులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ద్రావిడ యూనివర్సిటీలో చదివిన పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజా ప్రతినిధులు యూనివర్సిటీ వద్ద ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ద్రావిడ యూనివర్సిటీలో కోర్సులను రద్దు చేయకూడదని యూనివర్సిటీ పూర్వ విద్యార్ధులు  డిమాండ్ చేశారు. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయంలో అనేక మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని, ఇప్పుడు కొన్ని కోర్సులను రద్దు చేయడం హేయమైన చర్య అని విమర్శించారు.  కోర్సులను రద్దు చేస్తే ఆందోళన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష నేతలు, టి ఎన్ ఎస్ ఎఫ్ సభ్యులు, స్థానిక పూర్వ విద్యార్థులు హెచ్చరించారు.

రైళ్లలో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్స్ - హైదరాబాద్ వస్తున్న ట్రైన్స్‌ను నిలిపేసి ముమ్మర తనిఖీలు

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న రైళ్లలో బాంబు స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైళ్లలో బాంబులు పెట్టారనే సమాచారం అందడంతో అప్రమత్తం అయిన రైల్వే పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ సాయంతో తనిఖీలు చేపట్టారు. లోకమాన్యతిలక్ ఎక్స్‌ప్రెస్ రైలును కాజీపేటలో ఆపి, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలును చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఆపి సోదాలు చేశారు. అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేశారు. 

జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్

తెలంగాణలో రైతుల నుంచి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన వేళ ఆ దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి సీఎస్ ఆదేశించారు. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలులో నిమగ్నం చేయాలని నిర్దేశించారు. 

Tamilisai Sounderarajan: గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

గవర్నర్‌ తమిళిసైతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. వరి కొనుగోలు కేంద్రాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, అందువల్ల జరిగిన నష్టం, రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఫిర్యాదు చేశారు. విద్యుత్ చార్జీల పెంపు, జీవో 111 రద్దు విషయాలపై గవర్నర్‌కు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. జీవో 111 ఎత్తివేత విషయంలో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం అందజేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ, మధుయాస్కి, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, అంజన్ కుమార్ వంటి కాంగ్రెస్ నేతలు ఉన్నారు. 

Bhadradri Kothagudem: మణుగూరు వద్ద రోడ్డు ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను అశ్వాపురం మండలానికి చెందిన ఆసిఫ్‌ పాషా, భీష్మా రెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Background

ఏపీ ప్రజలకు ఎండల నుంచి మరో రెండు రోజులపాటు ఊరట కలగనుంది. దక్షిణ బంగాళాఖాతం నుంచి 45 - 55  కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు ఏపీలో వర్షాలు కురవనున్నాయని పేర్కొన్నారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీ, యానాంలో మరో రెండు నుంచి మూడు రోజులు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు నిలకడగా ఉన్నాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలకు నేడు సైతం వర్ష సూచన ఉంది. మరో రెండు నుంచి మూడు రోజులపాటు ఈ ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.. దక్షిణ బంగాళాఖాత నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల  తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు. తీరంలో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా నందిగామలో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గన్నవరంలో 38.2, అమరావతిలో 37.5, జంగమేశ్వరపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలున్నాయి.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమలో, దక్షిణ కోస్తాంధ్రలో ఉక్కపోత, వేడి మరింత పెరగనుంది. ఈ రోజు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 39 డిగ్రీల దాక నమోదు కానున్నాయి. రాయలసీమకు ఎలాంటి వర్ష సూచన లేదని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సీమలో ఉష్ణోగ్రతలు మళ్లీ భారీగా నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. ఇక్కడ అత్యధికంగా అనంతపురం, నంద్యాలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో  38.6, కడపలో 37.2 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలతో ఉక్కపోత కాస్త పెరిగింది.

తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఏమాత్రం ఊరట లభించడం లేదు. వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు రెండు రోజుల్లో ఊరట కలగనుంది. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కొన్ని జిల్లాల్లో ఓమోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు 

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Akhilesh On Temples : జ్ఞానవాపి మసీదు వివాదంపై ఎస్పీ చీఫ్ అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!

Jeevitha Rajasekhar: 'నా కూతురు లేచిపోయిందన్నారు - తప్పు చేస్తే కొట్టండి, అంతేకానీ' - జీవితా రాజశేఖర్ ఆవేదన!