అన్వేషించండి

Bhatti Vikramarka: సీఎం కేసీఆర్ అలాంటి మాటలు అనడం స‌రికాదు.. ద‌ళితబంధు ప‌థ‌కంపై ఇంకా సందేహాలు.. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క

పంట‌లు పండిస్తే ఉరి అని తెలంగాణ సీఎం కేసీఆర్ అనడం స‌మంజసం కాద‌ని సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. కేంద్ర‌ ప్ర‌భుత్వం వ‌ద్దు అంది కాబ‌ట్టి.. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కొన‌ను అన‌డం స‌రికాద‌న్నారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పంట‌లు పండిస్తే ఉరి అని చెప్ప‌డం స‌మంజసం కాద‌ని సీఎల్పీ నేత మల్లు భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. ఆయ‌న మంగ‌ళ‌వారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. రెండు జీవన‌దులు, గ‌తంలో చేప‌ట్టిన ప్రాజెక్టుల ద్వారా పంటలు సాగ‌వుతున్నాయ‌ని పేర్కొన్నారు. పంట‌లు మార్కెటింగ్ చేసుకోవాల‌ని, కేంద్ర‌ ప్ర‌భుత్వం వ‌ద్దు అంది కాబ‌ట్టి.. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కూడా కొన‌ను అన‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లికారు.

ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్పుడు ధాన్యం ఎలా కొన్నారో.. ఇప్పుడు కూడా అలాగే కొనాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు ఆందోళ‌న‌లో ఉన్నార‌ని, దీనిపై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త‌ను ఇవ్వాల‌న్నారు. ద‌ళితబంధు ప‌థ‌కంపై కొన్ని సందేహాలు ఉన్నాయ‌ని, దానిపై కూడా స్ప‌ష్ట‌త‌ను ఇవ్వాల‌ని కోరారు. 119 నియోజకవర్గాల పరిధిలో దళిత కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తంగా 17 ల‌క్ష‌ల కుటుంబాల‌కు రూ.1.7 ల‌క్ష‌ల కోట్లు అవ‌స‌రం అవుతాయ‌ని, ఏయే సంవ‌త్స‌రం ఎంత ఇస్తున్నార‌ని ప్ర‌శ్నించారు.

Also Read: Khairatabad Ganesh : వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర లేనట్లే ! నిమజ్జనంపై కీలక నిర్ణయం తీసుకున్న ఉత్సవ కమిటీ !

ఈ రూ.10 ల‌క్ష‌ల‌ను రుణంగా ఇస్తున్నారా లేదా పూర్తి స‌బ్సిడీగా ఇస్తున్నారా, దీనిపై రెండు మూడు రకాల వ్యాపారాలు చేసుకోవచ్చా అని సందేహం వెలిబుచ్చారు. ఈ సందేహాల‌పై అవ‌స‌రమైతే అసెంబ్లీని కూడా ఏర్పాటు చేయాల‌ని కోరారు. అలాగే పంజాగుట్ట‌లో రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని రెసిడెన్షియ‌ల్ హాస్ట‌ళ్ల‌లో ఎంతోమంది పేద విద్యార్థులు చ‌దువుతున్నార‌ని, పాల ఉత్ప‌త్తిని పెంచి వారికి ప్ర‌తిరోజూ గ్లాసు పాలు అందిస్తే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. డెయిరీ ఇండ‌స్ట్రీకి పెద్ద పీట వేయ‌డం ద్వారా అటు ఉత్ప‌త్తిని, ఇటు డిమాండ్ ను పెంచ‌వ‌చ్చ‌ని దీంతో ఎంతోమందికి ఉపాధి కూడా ల‌భిస్తుంద‌న్నారు. రోజురోజుకూ విస్తరిస్తున్న ఐటీ రంగానికి, గ్రామీణ ప్రాంతాల్లో బీటెక్ చ‌దివే విద్యార్థుల‌ను అనుసంధానం చేసే విధానాన్ని కూడా రూపొందించాల‌ని కోరారు.

Also Read: Sidabad Girl Rape Case Update: సైదాబాద్‌లో చిన్నారిపై హత్యాచార నిందితుడిపై భారీ రివార్డ్.. పట్టిస్తే రూ.10 లక్షలు.. సీపీ ప్రకటన

Also Read: Bandi Vs KTR : రాజీనామాకు సిద్ధమా..? కేటీఆర్ - బండి సంజయ్ పరస్పర సవాళ్లు !

Also Read: Met Gala 2021: 'మెట్ గాలా'లో హైదరాబాదీ మెరుపులు.. రెడ్ కార్పెట్‌పై బిలియనీర్ సుధా రెడ్డి హొయలు

టాప్ హెడ్ లైన్స్

Vedma Bojju Patel: ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
ఎమ్మెల్యేగా ఉన్నా, ఏం జరుగుతుందో తెలియడం లేదు: వెడ్మ బొజ్జు పటేల్
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
SIR పై అప్రమత్తంగా ఉండాలి, ఒక్క ఓటు కూడా గల్లంతు కాకూడదు: Jupally Krishna Rao
Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget