Khairatabad Ganesh : వచ్చే ఏడాది నుంచి ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర లేనట్లే ! నిమజ్జనంపై కీలక నిర్ణయం తీసుకున్న ఉత్సవ కమిటీ !
ఖైతరాబాద్ గణేశుడ్ని వచ్చే ఏడాది నుంచి ఉన్న చోటనే నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. నిమజ్జనానికి ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల నిర్ణయం తీసుకున్నారు. ఉన్న చోటనే నిమజ్జనం చేస్తే శోభాయాత్ర ఉండదు.
ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ఈ ఏడాదే ఆఖరు. ఇక మనం చూడలేకపోవచ్చు. ప్రత్యక్షంగా పాల్గొని గణనాధుడికి ఘనంగా వీడ్కోలు పలకాలన్న మన కోరిక నెరవేరకపోవచ్చు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి గణేషుడ్ని ప్రతిష్టిచిన చోటనే నిమజ్జనం చేస్తారు. ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి కారణం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి ఎదురవుతున్న అడ్డంకులుగానే భావిస్తున్నారు. Ganesh Nimajjan: హైదరాబాద్‌లో నిమజ్జనంపై రంగంలోకి కేసీఆర్.. ఆ రెండు ప్లాన్‌లకు మొగ్గు!
ఖైతరాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా ఆకర్షణ ఉంది. దేశంలో అతి పెద్ద వినాయకుడ్ని వినాయకచవితి సందర్భంగా ప్రతిష్టిస్తారు. లక్షల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు. నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రెండు నెలల ముందు నుంచే విగ్రహం తయారీని మొదలు పెడతారు. వీలైనంత వరకూ ప్రకృతి సిద్ధమైన మట్టి ఇతర రంగులతోనే చేస్తారు.కానీ అంత పెద్ద విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లాలంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాల్సిందే. కొన్ని వందల కిలోలను నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. Also Read : రాజీనామాకు సిద్ధమా..? కేటీఆర్ - బండి సంజయ్ పరస్పర సవాళ్లు !
ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌లోనూ అదే తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో తెలియదు కానీ ఈ ఏడాదికి ఖైరతాబాద్ గణేశుడ్ని నిమజ్జనం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాటు లేదు. చేస్తే హుస్సేన్ సాగర్‌లోనే చేయాలి లేకపోతే.. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే ఉత్సవ కమిటీ పెద్దలు ఇప్పటికే కోర్టు తీర్పులు ఎలా ఉన్నా.. నిమజ్జనం మాత్రం సాగర్‌లోనే చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. తమిళనాడులో జల్లికట్టు లాంటివి కోర్టు తీర్పులను ఉల్లంఘించి మరీ చేస్తున్నారని అంటున్నారు. Also Read : డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదా..? ఏళ్ల తరబడి వివాదం ఎందుకు సాగుతోంది ?
అయితే ఇది వివాదాస్పదం అవుతుంది. దైవ కార్యాన్ని ఇలా చేయడం సమంజసం కాదు కాబట్టి.. వచ్చే ఏడాది నుంచి ఉన్న చోటనే నిమజ్జనం చేయాలని నిర్ణయించారు. విజయవాడ, విశాఖ వంటి చోట్ల పెద్ద పెద్ద మట్టి విగ్రహాలను పెట్టే నిర్వహాకులు ఉన్నచోటనే నిమజ్జనం చేసే ప్రక్రియ అవలంభిస్తారు. ఈ సారి ఖైదరాబాద్ విగ్రహాన్ని మట్టి వినాయకునిగా చేసి నిమజ్జనం చేస్తారో లేక మామూలుగానే చేస్తారో కానీ ఈ సారి శోభాయాత్ర మాత్రం ఉండే అవకాశం లేదని తేలిపోతుంది. ఇప్పటికైతే ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాదికి ఏమైనా పరిస్థితులు మారతాయేమో చూడాలి.
Also Read : సినిమా పెద్దల సూచనలతోనే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు - ఏపీ సర్కార్ క్లారిటీ