అన్వేషించండి

TTDP Kasani : తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడు - ఇక జోరు పెంచబోతున్నారా ?

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను చంద్రబాబు నియమించారు. ఇటీవలే ఆయన తిరిగి పార్టీలో చేరారు.

 TTDP Kasani :    ఇటీవల పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు బక్కని నరసింహులను టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలో టీడీపీలో కీలక పాత్ర పోషించిన కాసాని జ్ఞానేశ్వర్.. ఇటీవలి కాలంలో సైలెంట్‌గా ఉన్నారు. ఇటీవల ఆయన టీఆర్ఎస్ లేదా బీజేపీలోకి చేరుతారని అనుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లి ఈటల, హరీష్ రావు చర్చలు జరిపారు. అయితే కాసాని మాత్రం అనూహ్యంగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పది రోజుల కిందట ఆయన టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆయనకు పగ్గాలు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మళ్లీ యాక్టివ్ చేసే ఆలోచనలో చంద్రబాబు

ఆర్థికంగా బలవంతుడైన కాసాని జ్ఞానేశ్వర్.. తెలంగాణలో పార్టీ పరిస్థితిని మెరుగు పరుస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు.ఎల్.రమణ టీ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత..  పూర్తిగా టీ టీడీపీ కార్యక్రమాలు ఆగిపోయాయి.  బక్కని నరసింహులును నియమించినా... క్యాడర్‌ను కదిలించలేకపోయారు. కాసాని జ్ఞానేశ్వర్ పలువురు బీసీ నేతలను మళ్లీ పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం... తెలంగాణ  బీసీ వర్గాల్లో టీడీపీకి ఇప్పటికీ మంచి ఆదరణ ఉందని .. దాన్ని ఓట్లుగా మలుచుకోగల నేతలు ఉంటే సీట్లు సాధించమని టీడీపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది.  2014లో 15 అసెంబ్లీ సీట్లు గెలిచిన టీడీపీ.. 2018లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా రెండు సీట్లు మాత్రమే గెలిచింది. గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. 

ముదిరాజ్ వర్గంలో మంచి పలుకుబడి ఉన్న కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్నారు కాసాని జ్ఞానేశ్వర్. తెలంగాణలో  ముదిరాజు సామాజిక వర్గం బలంగా ఉంది. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు కాసాని. గతంలో ఆయన ఎమ్మెల్సీగా, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. కాసాని చేరికతో టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం వస్తుందన్నారు చంద్రబాబు. త్వరలోనే తెలంగాణలో టీడీపీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నారు. తెలంగాణలో టీడీపీకి నేతలు దూరమైనా కేడ్ బలంగానే ఉందని అంచనా వేస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గ్రేటర్‌తో పాటు ఖమ్మం వంటి చోట్ల మంచి ఫలితాలు వచ్చేందుకు కాస్త కష్టపడే.. మంచి నాయకులు ఉంటే చాలన్న వాదన వినిపిస్తూండటంతో...  కాసానికి కొత్త బాధ్యతలు ఇవ్వడం.. చర్చనీయాంశమవుతోంది. 

త్వరలో మరిన్ని చేరికలు 

టీడీపీని వీడి ఇతర పార్టీల్లో చేరిన కొంత మంది నేతలు తిరిగి టీడీపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కొన్ని బలం ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి.. పని చేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటిలో శిశువు మృతదేహం మాయం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
Embed widget