అన్వేషించండి

Telangana Budget: బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి 20 వేల కోట్లు కేటాయించాలి - మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ

BC Welfare in TS Budget 2024: తెలంగాణ ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు కేటాయించాలని ఎమ్మెల్సీ కవిత ఆర్థిక మంత్రి భట్టికి లేఖ రాశారు.

MLC Kavitha On BC Welfare Budget 2024-25: హైదరాబాద్: తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చిందని, బడ్జెట్ లో నిధులు కేటాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బీసీ సంక్షేమం (BC Welfare) కోసం 2024-25 బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం నాడు ఆర్థిక మంత్రి భట్టికి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 
పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత
మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చిందని తన లేఖలో ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని కవిత ప్రస్తావించారు. అలాగే, ప్రతి జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్ల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందని లేఖలో తెలిపారు. 

బీసీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ తాజా బడ్జెట్ లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ నిధుల కేటాయింపు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చినట్లవుతుందని, బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి ఈ నిధులు దోహదపడుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలని, అందుకు బీసీలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
Breaking News: పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
పొలిటికల్ రీఎంట్రీ, భవిష్యత్ కార్యాచరణపై విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Mancherial MLA Prem Sagar Rao: అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం
అవినీతి ఆరోపణలపై మంచిర్యాల ఎమ్మెల్యే సవాల్ - సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆగ్రహం

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget