Manchryala Municipality : మంచిర్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం - వరుసగా బీఆర్ఎస్ చేజారుతున్న పురపాలికలు !
Telangana Congress : బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విశ్వాసాన్ని కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 20 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు.
Manchryala Municipality : మంచిర్యాల పురపాలక సంఘం బీఆర్ఎస్ చేతుల్లో నుంచి జారీ పోయింది. బీఆరెస్ కు చెందిన చైర్మన్ పెంట రాజయ్య, వైస్ ఛైర్మన్ గాజుల ముకేశ్ గౌడ్ లపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ కౌన్సిలర్ లు నెగ్గారు. గురువారం కలెక్టర్ సంతోష్ సమక్షంలో అవిశ్వాసం ప్రక్రియ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంకు బీఆరెఎస్ కౌన్సిలర్ లు గైరాజర్ కాగా కాంగ్రెస్ కౌన్సిలర్ లు 26 మంది, బీజేపీ కౌన్సిలర్ మోతే సుజాత హాజరయ్యారు. చైర్మన్, వైస్ ఛైర్మన్ లపై అవిశ్వాసము పెట్టాలని గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్ లు సంతకాలతో కూడిన వినతిపత్రంను కలెక్టర్ కు అందజేశారు.
నిర్ధేశిత గడువు అనంతరం గురువారం అవిశ్వాసం ప్రక్రియలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించారు. ఉదయం చైర్మన్ కు మధ్యాహ్నం వైస్ చైర్మన్ కు అవిశ్వాసం నిర్వహించారు. ఈ అవిశ్వాసంలో 26 మంది కాంగ్రెస్ కౌన్సిలర్ లతో పాటు మరో కౌన్సిలర్ సుజాత కూడా మద్దతుగా నిలిచారు. ధీంతో ఛైర్మన్ గా పెంట రాజయ్య, వైస్ ఛైర్మన్ గా గాజుల ముకేశ్ గౌడ్ పదవులను కోల్పోయినట్లు అయ్యింది. అయితే నూతన చైర్మన్ గా ఉప్పలయ్య, వైస్ ఛైర్మన్ గా సల్ల మహేష్ లను మిగతా కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. ఈ ఎన్నిక లాంఛనమే కాగా.. కలెక్టర్ నిర్ణయం మేరకు వారి ఎన్నిక జరగవలసి ఉంది.
అటూ బెల్లంపల్లి మున్సిపాలిటీలో బిఅర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు రాజీనామా చేశారు. గత నెల 7వ తేదీన చైర్ పర్సన్ శ్వేత, వైస్ చైర్మన్ సుదర్శన్లపై అవిశ్వాసం కోరుతూ.. జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ కు లేఖ అందజేసిన విషయం విధితమే. అయితే బిఅర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు క్యాంప్ కి వెళ్లాల్సి ఉంది. అవిశ్వాస విషయంపై పార్టీ అధిష్టానం పట్టించుకోకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.
023 జనవరితో మున్సిపాలిటీ చైర్మన్ల పదవీ కాలం మూడేండ్లు ముగియడంతో నిబంధనల ప్రకారం అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం మారడంతో అవిశ్వాసాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పెద్ద ఎత్తున మున్సిపాలిటీల్లో కౌన్సెలర్లు పార్టీ మారుతున్నారు. వారంతా.. అవిశ్వాసం పెట్టి ప్రస్తుత చైర్మన్లను దింపేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా చైర్మన్లు అవుతున్నారు. ఈ పరిస్థితిని నిలువరించడానికి బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.