అన్వేషించండి

KTR News: 50 వేల రైతులతో కాళేశ్వరం పంప్‌లు ఆన్ చేస్తాం - ప్రభుత్వానికి కేటీఆర్ డెడ్ లైన్

Telangana News: లోవర్ మానేర్ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ నేతల బృందం పరిశీలించింది. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించి మీడియాతో మాట్లాడారు.

KTR News: ఆగస్ట్ 2 లోపు కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకుంటే 50 వేల మంది రైతులతో కలిసి మోటార్లను మేమే ఆన్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మీద కక్షతో రైతుల నోట్లో మట్టికొట్టే దుర్మార్గపు ఆలోచన చేయవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల బృందం రెండు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. గురువారం సాయంత్రం కరీంనగర్ లోని ఎల్ఎండీ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. శుక్రవారం ఉదయం కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డ బ్యారేజ్ ను బీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. 

మధ్యలో కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి దర్శించుకున్నారు. అక్కడే గోదావరి నదికి ప్రత్యేక పూజాలు చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ పరిశీలించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల కోసం రైతులను బలి పెట్టవద్దని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని కోరారు. శ్రీరాం సాగర్, ఎల్ఎండీ,  మిడ్ మానేరు, ఎల్లంపల్లి లో నీరు లేని కారణంగా రైతుల పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు గోదావరి ఎగువన నీటి కరువు ఉంటే...మేడిగడ్డ వద్ద మాత్రం పదిలక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. ఈ నీటిని సకాలంలో ఎత్తిపోసుకుంటే శ్రీరాంసాగర్, ఎల్ఎండీ, మిడ్ మానేర్, రంగనాయకమ్మ సాగర్, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ జలాశయాలను నింపుకొని నీటి కొరత లేకుండా చేసుకోవచ్చని అన్నారు.

కేసీఆర్ పై కోపంతోనే..
కానీ కేసీఆర్ పై కోపం, రాజకీయ కక్ష ల కారణంగానే నీటిని ఈ ప్రభుత్వం ఎత్తిపోయటం లేదని కేటీఆర్ విమర్శించారు. పైన నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు నీటిని ఎత్తిపోయకుంటే వానాకాలం పంట కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుందన్నారు. గతేడాది తమ ప్రభుత్వం సకాలంలో నీటి ఎత్తిపోసి ఎల్ఎండీ, మిడ్ మానేర్ సహా రంగనాయకమ్మ, మల్లన్న సాగర్ వరకు నీటిని తరలించిందని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం రైతుల పంటలు ఎండిపోయిన సరే కేసీఆర్ కు పేరు రావద్దన్న దురుద్దేశంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గత డిసెంబర్- జనవరిలో కూడా రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరితే రాజకీయ ప్రయోజనం కోసం రైతుల పంటలను ఎండబెట్టారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) పేరుతో ఒక్కరోజులోనే నివేదిక ఇచ్చి మేడిగడ్డకు ఏదో జరిగిపోయినట్లు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ కూడా కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగపాలు అంటూ తప్పుడు ప్రచారం చేసిందన్నారు. మొత్తానికి మీరు చేసిన కుట్రలతో కేసీఆర్ ను గద్దె దించారని ఇంకా రాజకీయాలెందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు కూడా సుందిళ్ల, అన్నారంలో ఏదో ప్రమాదం అంటూ ఎన్డీఎస్ఏ పేరుతో సాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుందిళ్ల, అన్నారంలో డ్రౌటింగ్ పనులు ఆపరేషన్ అండ్ మెయింటెన్స్ లో భాగమేనని అధికారులు చెప్పారన్నారు. బ్రహ్మండంగా నీటి ఎత్తిపోసుకునేందుకు అవకాశం ఉందని ఒక్క ప్రభుత్వం నిర్ణయం కోసమే ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు.  

కాళేశ్వరంపై కేసీఆర్ మీద చేసిన తప్పుడు ప్రచారాలు గోదావరి ప్రవాహంలో కొట్టుకుపోయాయని కేటీఆర్ అన్నారు. బంగారు పళ్లెంలో పంచభక్ష పరమాన్నాలు వడ్డించి పెట్టినట్లు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మీకు సిద్ధం చేసి ఇచ్చారన్నారు. దాన్ని కూడా వాడుకోలేని దౌర్బగ్యపు పరిస్థితి లో ఈ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. తెలంగాణలో కరువు అనే పదమే ఉండకుండా చేసేందుకే కాళేశ్వరం లాంటి ప్రతిష్టాత్మకమైన బహుళార్థక ప్రాజెక్ట్ ను కేసీఆర్ తన సంకల్ప బలంతో పూర్తి చేశారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు కామధేనువు, కల్పతరువని చెప్పారు. గతంలో కాళేశ్వరం విషయంలో కేసీఆర్ ను బద్నాం చేశాం. ఇప్పుడు పంప్ లు ఆన్ చేస్తే కేసీఆర్ పై మనం చేసిన ప్రచారం తప్పని తేలుతుందని కాంగ్రెస్ నేతలు తేలు కుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారన్నారు’’ అని కేటీఆర్ హెచ్చరించారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
TPCC Circular: పాలాభిషేకాలు, జేసీబీలతో భారీ దండలు బంద్ - టీపీసీసీ సంచలన సర్క్యులర్!
పాలాభిషేకాలు, జేసీబీలతో భారీ దండలు బంద్ - టీపీసీసీ సంచలన సర్క్యులర్!
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
KTR GHMC Elections Strategy: గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !
గ్రేటర్ ఎన్నికల కోసం మైక్రో లెవల్ ప్లానింగ్ - స్పెషల్ వార్ రూమ్ - కేటీఆర్ ఇజ్జత్‌కా సవాల్ !

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget