అన్వేషించండి

KCR Chevella Comments: దళిత బంధు ఇవ్వకపోతే దీక్షకు దిగి, ప్రభుత్వం మెడలు వంచుతా: కేసీఆర్ వార్నింగ్!

Telangana News: తెలంగాణ ప్రభుత్వం దళితబంధు ఇవ్వకుండా లబ్ధిదారులను మోసం చేస్తోందని, వారికి రూ.10 లక్షలు ఇవ్వకపోతే అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షకు దిగుతామని కేసీఆర్ హెచ్చరించారు.

Dalit Bandhu Scheme: చేవెళ్ల: మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR). తాము ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధును ఇవ్వకుంటే లబ్ధిదారులను తీసుకొచ్చి, సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Government) మెడలు వంచి ఆ నిధులు విడుదల చేపిస్తా అన్నారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ఐక్యరాజ్యసమితి కొనియాడిందన్నారు. ఇతర రాష్ట్రాలు సైతం తాము తీసుకొచ్చిన పథకాలను వారి రాష్ట్రాల్లో అమలు చేయాలని, ఇక్కడికి వచ్చి పరిశీలించి అభినందించాయని కేసీఆర్ పేర్కొన్నారు. 

దళిత బంధు ఇవ్వపోతే పోరాటమేనన్న కేసీఆర్ 
కాంగ్రెస్ పార్టీ దళితులకు 12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి, ఒక్కరికి కూడా ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు కనీసం 10 లక్షలు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల్ని మోసం చేసిందంటూ కేసీఆర్ మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో ప్రొసిడింగ్ అయిన 1 లక్ష 30 వేల మందికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి దళితబంధు నగదు ఇవ్వకపోతే లబ్ధిదారులను తీసుకువచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగుతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త
ఉచిత కరెంట్, రైతు బంధు ఇవ్వకున్నా, రైతులకు బోనస్ ఇవ్వకున్నా మాకే ఓటేస్తారు అని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఓటు వేసే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలి. లేకపోతే ఏం చేయకున్నా మమ్మల్ని ఎవరు ఏం అనరు అనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. తెలంగాణ ప్రజలు తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వం మీకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేరాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి, అందుకే మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. 

పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించండి 
మీ బీసీలకు దమ్ముంటే, బీసీలకు పౌరుషం ఉంటే కాసాని జ్ఞానేశ్వర్‌ని గెలిపించండి అని కాంగ్రెస్ నేత అన్నారు. అందుకే ఇక్కడున్న బలహీనవర్గాల మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు  కాసానిని గెలిపించాలని కేసీఆర్ కోరారు. గెలుపు, బీసీల అభివృద్ధికి మలుపు కాబట్టి కాసానిని గెలిపించి చూపించాలన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రయోజనాల కోసం అని, ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. తాను బతికి ఉన్నన్ని రోజులు తెలంగాణ ప్రజల కోసం పోరాడతామన్నారు. 10 ఏళ్లు అధికారం ఇస్తే అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం, కానీ నేడు అన్నీ నా కళ్ల ముందే పోతుంటే చూడలేక చాలా బాధ కలుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో మీ దీవెనతో విజృంభించి తెలంగాణ సాధించినం, అవసరమైతే మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాసానిని గెలిపిస్తే ఎంపీగా చేవెళ్ల ప్రజల పక్షాన పోరాడి నిధులు తెస్తారని ధీమా వ్యక్తం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget