Secunderabad Cantonment: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్, సాయన్న ఫ్యామిలీకే ఛాన్స్
Lasya Nanditha Sister Niveditha: లాస్య నందిత మరణంతో ఖాళీ ఏర్పడిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఆమె సోదరి, సాయన్న కూతురు నివేదితకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది.
![Secunderabad Cantonment: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్, సాయన్న ఫ్యామిలీకే ఛాన్స్ BRS announces candidate for secunderabad cantonment Secunderabad Cantonment: కంటోన్మెంట్ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్, సాయన్న ఫ్యామిలీకే ఛాన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/07/f6cc22943f9d0215db15eea2dfbdab8a1712498689450233_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
BRS announces candidate for secunderabad cantonment: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. దివంగత నేత సాయన్న కూతురు నివేదితను తమ అభ్యర్థిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే లాస్య నందింత చెల్లెలు ఈ నివేదిత(Niveditha) . కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయి ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఎర్రవెళ్లిలోని ఫాం హౌస్ లో కేసీఆర్ చర్చలు
Lasya Nanditha Sister Niveditha - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలతో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్‌లో ఆదివారం భేటీ అయ్యారు. వరంగల్ ఎంపీ స్థానంతో పాటు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై పార్టీ కీలక నేతలతో కేసీఆర్ చర్చించారు. ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత (కంటోన్మెంట్) కుటుంబసభ్యులు హాజరయ్యారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా తండ్రి, కూతురు మృతి
లాస్య నందిత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో SC రిజర్వ్డ్ నియోజకవర్గమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సమీప ప్రత్యర్థి గణేష్ పై నందిత విజయం సాధించారు. లాస్య నందిత తండ్రి, జి. సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దురదృష్టవశాత్తూ ఫిబ్రవరి 2023లో సాయన్న మరణించారు. గత ఏడాది నవంబర్ నెలాఖరులో జరిగిన ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి విజయం సాధించిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తెలిసిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)