Breaking News LIVE: కుటుంబం సజీవదహనం కేసులో ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ అరెస్ట్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE

Background
వనమా రాఘవను అరెస్ట్ చేసిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాసిన గంటలోపే వనమా రాఘవను అరెస్ట్ చేయడం గమనార్హం. కాగా రాఘవను కొత్తగూడెం తరలించి కేసు విషయంలో విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది.
రేపు కొత్తగూడెం బంద్.. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల పిలుపు
రేపు కొత్తగూడెం బంద్‌కు రాజకీయ పార్టీలు, వామపక్ష, విపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులను శిక్షించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రాజీనామా చేయాలని.. వనమా రాఘవను అరెస్టు చేసి రౌడీషీట్ తెరవాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బంద్ చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఏపీ సీఎంతో మొదలైన ఉద్యోగ సంఘాల చర్చలు
ఏపీ సీఎం జగన్‌తో ఉద్యోగ సంఘాల చర్చలు మొదలు అయ్యాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 13 ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. వీటిలో ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసులు పర్మినెంట్ చేయడం తదితర డిమాండ్లు ఉన్నాయి. వీటిని సత్వరమే పరిష్కరించాలని ఆయా సంఘాల నేతలు సీఎంను కోరనున్నారు.
యువతిపై యాసిడ్ దాడి
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లక్కారం పరిధిలోని కే బి నగర్ లో యువతి పుష్పపై గుర్తుతెలియని వ్యక్తులు ఆసిడ్ తో దాడి చేశారు. గాయాలపాలైన మహిళ ఉట్నూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
డ్రగ్స్ పట్టుబడ్డ కేసులో ఏడుగురు అరెస్టు: సీపీ
డ్రగ్స్ వినియోగదారుల్లో యువకులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు. డిమాండ్‌ను తగ్గిస్తే డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవచ్చని అన్నారు. గురువారం టాస్క్స్ ఫోర్స్ పోలీసులు హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సదర్భంగా నిందితులను సీపీ ఆనంద్ మీడియా మందు హాజరుపరిచారు. ఏడుగురిని అరెస్టు చేశామని తెలిపారు. వారివద్ద 99 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండీఎంఏ, 17 ఎస్‌ఎస్‌డీఈ, 27 ఎక్స్‌టాసీ ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ.16 లక్షలు ఉంటుందని చెప్పారు. నైజీరియాకు చెందిన టోనీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీపీ వెల్లడించారు. ఏజెంట్లను నియమించుకుని రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. డ్రగ్స్ తీసుకుంటున్నవారి జాబితా సేకరిస్తున్నామన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

