అన్వేషించండి

Telangana News : పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహాల కిడ్నాప్ - తెలంగాణ ప్రభుత్వం పనేనని బీజేపీ నేతల ఆరోపణలు !

తెలంగాణలో విగ్రహాలు కిడ్నాప్ అయ్యాయని బీజేపీ నేత సత్యకుమార్ ఆరోపించారు. ప్రభుత్వమే ఈ పని చేసిందంటున్నారు.


Telangana News  :  తెలంగాణ కొత్త సచివాలయానికి ఎదురుగా ఉన్న తెలుగు తల్లి విగ్రహం, పొట్టి శ్రీరాములు విగ్రహాలు కనిపించడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆరోపించారు. వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వమే కిడ్నాప్ చేసిందని మండిపడ్డారు. నూతన సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న విగ్రహాలు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ కాబడ్డాయి. ఎక్కడున్నాయో తెలియదని.. ఆంధ్రా నాయకులను, చిహ్నాలను అవమానించడమే అలవాటుగా మార్చుకున్న కేసీఆర్ గారు, కేటీఆర్ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే ఆ రెండు విగ్రహాలను పునఃప్రతిష్టింపచేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.            

నాలుగు రోజుల కిందట వరకూ ఉన్న ఆ విగ్రహాలను రాత్రికి రాత్రే అధికారులు తీసేసినట్లుగా తెలుస్తోంది. కొత్త సెక్రటేరియట్ మార్గం కోసం రోడ్లలో మార్పు చేర్పులు చేస్తున్నారు. ఈ సందర్భంగా విగ్రహాలు అడ్డు వస్తాయన్న కారణంగా తొలగించినట్లుగా తెలుస్తోంది. అయితే ఎక్కడ ప్రతిష్టిస్తారన్న దానిపైస్పష్టత లేదు.  తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలుగు తల్లి కాదని.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ రూపొందించింది. అయితే సెక్రటేరియట్ ప్రాంతంలో తెలుగు తల్లి విగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. అక్కడి ఫ్లైఓవర్‌ను తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడా విగ్రహాన్ని తరలించారని బీజేపీ నేతలు అంటున్నారు.                                                                               
  తెలంగాణంలో కొత్తగా నిర్మిస్తున్న సచివాలయాన్ని నెలాఖరులో ప్రారంభించనున్నారు.  కొత్త సచివాలయాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్టుతో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే! భవనంలోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా సహజంగా డిజైన్ చేశారు. ఆవరణలో ఓ ఆలయం, మసీదును కూడా నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రూ.617 కోట్లు వెచ్చిస్తోంది. ఈ భవన సముదాయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. కాగా, సచివాలయ ప్రారంభోత్సవంపై నిర్ణయం తీసుకోవడంతో నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్ ను ప్రభుత్వం ఆదేశించింది. నిర్మాణ పనుల్లో వేగం పెంచడానికి మూడు షిప్టుల్లో పనులు చేస్తున్నట్లు సమాచారం.                     

సచివాలయం ఎదురుగా చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం కూడా చివరిదశకు చేరుకుంది.  అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తయి ప్రారంభం కూడా జరిగింది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా లోపల ఉన్న ఆలయాలు, ప్రార్థనా స్థలాలను కూడా తొలగించారు. వాటిని మరో చోట నిర్మించి ఇస్తున్నారు. ఆ ప్రకారమే .. రోడ్డు కోసం తొలగించిన విగ్రహాలను మళ్లీ ఎక్కడో చోట పెడతారని భావిస్తున్నారు.                         

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మికపెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget