అన్వేషించండి

BJP Leader Madhavi Latha: ప్రచారంలో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకూ - మాధవీలత ఇలా మారిపోయారేంటి?

Madhavi Latha Shooting Championship: హైదరాబాద్ బీజేపీ నేత మాధవీలత షూటర్ అయ్యారు. పోటీల్లో కూడా పాల్గొంటున్నారు.

Madhavi Latha Sports Pistol:  హైదరాబాద్ బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది వివాదాలే. ఎన్నికల ప్రచారంలో ఓ వర్గం ప్రార్థనా మందిరంపైకి ఆమె బాణం వేస్తున్నట్లుగా చేసిన యాక్షన్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఆమె తుపాకీతో షూటింగ్ చేస్తున్నారు.    స్పోర్ట్స్ పిస్టల్ అందుకుని షూటింగ్ రేంజ్‌లో ప్రత్యక్షమయ్యారు. XII తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో అథ్లెట్‌గా బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు. 

ఆరు సంవత్సరాల గాయం.. ఓటమి ఎరుగని పోరాటం! 

రాజకీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా బిజీగా ఉండే మాధవీలత వెనుక ఒక తెలియని శారీరక సంఘర్షణ ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆరేళ్ల క్రితం ఆమెకు ఎదురైన తీవ్రమైన భుజం గాయం ఆమె జీవితాన్ని శారీరకంగా ఎన్నో పరిమితుల్లోకి నెట్టేసింది. అయితే, ఆ పరిమితులకు లొంగిపోవడం ఆమె నైజం కాదని మరోసారి రుజువైంది. గాయాన్ని ఒక సవాలుగా తీసుకుని, విల్‌పవర్‌తో స్పోర్ట్స్ పిస్టల్ పట్టి సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వయసు గానీ, శారీరక ఎదురుదెబ్బలు గానీ ఏవీ కూడా తిరిగి లేవడానికి అడ్డంకులు కావని ఆమె తన తాజా నిర్ణయం ద్వారా చాటిచెప్పారు.   

 
 వివాదాల నుంచి పతకాల వేట వైపు.. 

గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ వేదికగా అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేసి దేశవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచారు మాధవీలత. ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన బాణం వేసే సైగలు, ఆ తర్వాతి కాలంలో వచ్చిన పలు పొలిటికల్ ఇష్యూస్ ఆమె చుట్టూ ఎప్పుడూ వివాదాల వలయాన్ని సృష్టించాయి. అయితే, వాటన్నింటినీ పక్కనబెట్టి ఇప్పుడు డిసిప్లిన్, ఫోకస్ అత్యంత అవసరమైన 'షూటింగ్' స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వెనుక ఆమె వ్యూహాత్మక ఆలోచన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కేవలం గెలవడం, ఓడడం కోసమే కాకుండా.. అడ్డంకులను అధిగమించి ముందుకు సాగే ధైర్యాన్ని ప్రదర్శించడానికే తాను తుపాకీ పట్టినట్లు ఆమె పేర్కొన్నారు.
 
 నేను కాదు.. మనమంతా చేయగలం  - భారత్ కోసం పిలుపు! 

తన జీవిత ప్రయాణం దేశంలోని కనీసం ఒక్క మహిళకైనా, యువతకైనా స్ఫూర్తినిచ్చినా తన ప్రయత్నం సఫలమైనట్లేనని మాధవీలత చెబుతున్నారు. అసాధ్యం అనుకున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ పౌరులు ముందుకు రావాలి..  నేను చేయగలను అనే స్థాయి నుంచి మనం చేయగలం  అనే నమ్మకంతో పటిష్టమైన, ఆత్మవిశ్వాసం గల భారత్‌ను నిర్మిద్దాం అంటూ ఆమె ఇచ్చిన పిలుపు ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రాజకీయ వేడిని కాసేపు పక్కనబెట్టి, ఒక క్రీడాకారిణిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడటానికి ఆమె చూపిన చొరవపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆమె సంకల్పాన్ని మాత్రం అందరూ అభినందిస్తున్నారు.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget