అన్వేషించండి

Raghunandan Rao: సిద్దిపేట నుంచే నా ఫోన్ ట్యాపింగ్, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు

Medak News: దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ తో పాటు కుటుంబసభ్యుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని రఘునందన్ రావు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.

Raghunandan Rao complaints to DGP regarding Phone Tapping Case: హైదరాబాద్: దుబ్బాకతో పాటు మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సిద్దిపేట (Siddipet)లో వార్ రూట్ ఏర్పాటు చేసి.. తన ఫోన్‌తో పాటు కుటుంబసభ్యుల ఫోన్లు, మరికొందరు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping Case) చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని డీజేపీని కలిసిన మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. 

సీఎం ఆదేశాలు లేకుండా ట్యాపింగ్ జరుగుతుందా?
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగే ప్రసక్తి లేదు. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు దుబ్బాక ఎన్నికల ఇంచార్జ్ గా ఉన్న హరీష్ రావు, అప్పటి కలెక్టర్ వెంకటరామిరెడ్డిలను ముద్దాయిలుగా చేర్చాలని డీజీపీని రఘునందన్ రావు కోరారు. ఫోన్ ట్యాపింగ్ డివైస్ లను ఎవరు కొనుగోలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎవరి ఆదేశాలతో  ట్యాపింగ్ చేశారు. దీనిపై నిష్పక్ష పాతంగా విచారణ జరిపించాలని డీజీపీని కోరినట్లు రఘునందన్ రావు తెలిపారు. 

Raghunandan Rao: సిద్దిపేట నుంచే నా ఫోన్ ట్యాపింగ్, ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు

అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లే టార్గెట్‌గా ట్యాపింగ్

ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి, కర్ణాటక లో కుమార స్వామికి లబ్ధి చేకూరాలనే ఫోన్లు ట్యాపింగ్ చేశారని రఘునందన్ రావు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లను తెలంగాణ కేంద్రంగా ట్యాపింగ్ చేసి సంభాషణలు విన్నారని ఆరోపణలున్నాయి. సబితా ఇంద్రా రెడ్డిపై పోటీ చేసిన బీజేపీ నేత అందెలా శ్రీరాములు యాదవ్ నెంబర్ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పారు. రాజకీయ నేతల ఫోన్లతో పాటు హైకోర్టు జడ్జీల ఫోన్ కాల్ సంభాషణలు కూడా విన్నారని తెలిసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేడు తెలంగాణకు వస్తున్నారని, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం సీజేఐకి చెప్పాలని కోరారు. 

మరిన్ని రంగాల వారి ఫోన్లు ట్యాపింగ్
తెలంగాణ కేంద్రంగా కేవలం రాజకీయ నేతల ఫోన్లు మాత్రమే కాదు, సినిమా రంగానికి చెందిన వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, తీర్పులు చెప్పే న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సినిమా వాళ్లను, రియల్ ఎస్టేట్ వాళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడి, డబ్బులు వసూలు చేసినట్లు చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బినామీ ఛానెల్ ఓనర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని.. సమగ్ర విచారణ జరిపించాలని డీజేపీని రఘునందన్ రావు కోరారు. ఒకవేళ పోలీసులు ఈ కేసులో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోకపోతే  న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ICC U19 T20 Women's World Cup: అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
Telangana News: గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
Anjali: 'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maha Kumbha Mela 2025 | అతి తక్కువ బడ్జెట్ తో తెలుగు రాష్ట్రాల నుండి మహా కుంభమేళాకు రూట్ మ్యాప్ | ABP DesamBumrah ICC Mens Test Cricketer of The Year | బౌలింగ్ తో అదరగొట్టాడు..ఐసీసీ కిరీటాన్ని ఒడిసి పట్టాడు | ABP DesamBaba Ramdev Maha Kumbh Mela Yoga | మహా కుంభమేళాలో యోగసేవ చేస్తున్న బాబా రాందేవ్ | ABP DesamAmit Shah Prayagraj Maha Kumbh 2025 | ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో అమిత్ షా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ICC U19 T20 Women's World Cup: అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
అండర్-19 టీ20ల్లో తొలి సెంచరీ నమోదు చేసిన గొంగడి త్రిష - ప్రపంచకప్‌లో తెలుగు బ్యాటర్‌ సంచలనం
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
Telangana News: గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
గద్దర్‌ను తీవ్రవాదులతో పోల్చిన విష్ణువర్దన్ రెడ్డి - రేవంత్‌పై సెటైర్లు
Anjali: 'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
'గేమ్‌ ఛేంజర్‌' ఫలితంపై అంజలి ఫస్ట్‌ రియాక్షన్‌... ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంది, కానీ
US President Donald Trump News: ఇండియా అభివృద్ధికి అమెరికా ఎందుకు సాయం చేయాలి- మోదీ ఫోన్ చేసిన రోజే షాక్ ఇచ్చిన ట్రంప్‌
ఇండియా అభివృద్ధికి అమెరికా ఎందుకు సాయం చేయాలి- మోదీ ఫోన్ చేసిన రోజే షాక్ ఇచ్చిన ట్రంప్‌
Budget 2025: బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరుగుతాయా, కస్టమ్ డ్యూటీపై కేంద్రం ఆలోచన ఏంటి?
బడ్జెట్ తర్వాత బంగారం ధరలు పెరుగుతాయా, కస్టమ్ డ్యూటీపై కేంద్రం ఆలోచన ఏంటి?
APSRTC Maha Kumbh Mela: మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
మహా కుంభమేళాకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులు.. 8 రోజుల ప్యాకేజీ ఛార్జీల వివరాలివే!
Boost Male Fertility : మగవారు సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే.. ఫెర్టిలిటీ సమస్యలు దూరం చేసుకోండిలా
మగవారు సంతానోత్పత్తిని మెరుగుపరచుకోవడానికి ఫాలో అవ్వాల్సిన డైట్ ఇదే.. ఫెర్టిలిటీ సమస్యలు దూరం చేసుకోండిలా
Embed widget