Bharat Mukti Morcha : మరో జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా కవిత - భారత్ ముక్తిమోర్చాకు రావాలని నిర్వాహకుల ఆహ్వానం !
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో జాతీయ సదస్సులో చీఫ్ గెస్టుగా పాల్గొనాలని ఆహ్వానం అందింది. లక్నోలో ఈ సదస్సు జరగనుంది.
Bharat Mukti Morcha : మరో జాతీయ సదస్సులో చీఫ్ గెస్టుగా పాల్గొనాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది భారత్ ముక్తమోర్చా జాతీయ సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిర్వాహకులు ఆహ్వానించారు. హైదరాబాదులో భారత్ ముక్తి మోర్చా మరియు వెనుకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ ప్రతినిధులు కల్వకుంట్ల కవితను కలిశారు. భారత్ ముక్తి మోర్చా 12వ, వెనుకబడిన, మైనారిటీవర్గాల ఉద్యోగుల ఫెడరేషన్ 39వ జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి విలాస్ ఖారత్ ఆహ్వానించారు. భారత్ ముక్తి మోర్చా ఆహ్వానం మేరకు జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవ్వడానికి కల్వకుంట్ల కవిత అంగీకరించారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో మోర్చా జాతీయ అధ్యక్షుడు వామన్ మేశ్రమ్ నేతృత్వంలో ఈ రెండు సంస్థల జాతీయ సదస్సులు జరగనున్నాయి.
ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ కు చీఫ్ గెస్ట్ గా ఆహ్వానం
ఇటీవలే ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ప్రసంగించేందుకు కూడా కవితకు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. జనవరి 2, 3 తేదీల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేరళలో పర్యటించనున్నారు. కేరళలోని కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పలికారు. జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ సమావేశాలను జనవరి 1న కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, బీహార్‌తోపాటు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
భారత్ జాగృతి ఏర్పాటు - అన్ని రాష్ట్రాల్లో కీలకంగా జాగృతి కార్యకలాపాలు
తెలంగాణ ఉద్యమంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ స్థాయి పార్టీగా మారినదున తెలంగాణ జాగృతిని భారత్ జాగృతిగా మార్చాలని కవిత నిరణయించారు. తెలంగాణ జాగృతి పంథాను మార్చుకొని, దేశ ప్రజలను చైతన్య పరిచేలా, చర్చను రగిలించేలా కార్యాచరణ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. తెలంగాణ జాగృతి తరహాలోనే భారత్ జాగృతి రిజిస్టర్ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కార్యవర్గాలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపట్డానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భారత్ జాగృతి తరపపున జ్ఞానపీఠ్ తరహాలో ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చేందుకు తెర వెనక కొందరు కవులు, రచయితలు, కళాకారులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో కవితకు.. ఇతర రాష్ట్రాల కార్యక్రమాల్లో ముఖ్య అతిధిగా పాల్గొనేందుకు ఆహ్వానాలు వస్తూండటం ఆసక్తికరంగా మారింది.
అది అబద్దమన్న కవిత - నిజం నిప్పులాంటిదన్న కోమటిరెడ్డి ! ఈ ఇద్దరి వాగ్వాదంలో అసలు ట్విస్ట్ ఇదే