Rajagopal Vs Kavitha : అది అబద్దమన్న కవిత - నిజం నిప్పులాంటిదన్న కోమటిరెడ్డి ! ఈ ఇద్దరి వాగ్వాదంలో అసలు ట్విస్ట్ ఇదే
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ నేత కోమటిరెడ్డి సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు.
Rajagopal Vs Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన తాజా చార్జిషీటులో కవిత పేరు 28 సార్లు ఉందని.. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మద్యం దందాలో కవిత పేరు ఉందంటూ బీజేపీ లీడర్ రాజగోపాల్ చేసిన కామెంట్స్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. తొందరపడి మాట జారొద్దని సూచించారు. ఎన్నిసార్లు చెప్పినా అబద్దం నిజం అయిపోదన్నారు. తాజాగా కోర్టుకు ఈడీ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు ప్రస్తావించారు. దీంతో ప్రతిపక్షాలు విమర్శలకు పదను పెట్టాయి. ఇందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కొన్ని పత్రికల వార్తలను ట్వీట్ చేస్తూ కవిత పేరు ప్రస్తావించకుండానే లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారని విమర్శించారు.
“Liquor Queen’s” name was mentioned 28 times in chargesheet. pic.twitter.com/MpT9788DSE
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022
రాజ్‌గోపాల్‌రెడ్డి ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన కవిత... తొందరపడొద్దని మాట జారొద్దని సూచించారు. 28 సార్లు కాదు 28వేల సార్లు తన పేరు చెప్పినా అబద్దం నిజమైపోదని కామెంట్ చేశారు. మాణిక్యం ఠాకూర్ చేసిన ట్వీట్‌కి కూడా కవిత రియాక్ట్ అయ్యారు. తనపై మోపిన అభియోగాలన్నీ బోగస్ అని కొట్టిపారేశారు. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుందని అభిప్రాయపడ్డారు. ఇదంతా బీజేపీ రాజకీయ ఆటలో భాగమని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్‌ను ఆపడానికే ఇదంతా చేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేకంగా, కార్పొరేట్‌కు బీజేపీ చేపడుతున్న తీసుకుంటున్న విధానాలు ప్రజల ముందు ఉంచుతున్నారనే కక్షతోనే ఇదంతా సాగుతున్నారు.
రాజగోపాల్ అన్న ..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
తొందరపడకు , మాట జారకు !!
" 28 సార్లు " నా పేరు చెప్పించినా
" 28 వేల సార్లు " నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC
దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు. చెల్లెమ్మా అని సంబోధిస్తూ నిజం నిప్పులాంటిదని.. మునుగోడు ఉపఎన్నికల సమయంలో తన వ్యక్తిత్వంపై నిందలేశారని జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
నిజం నిప్పులాంటిది చెల్లెమ్మ. నువ్వు లిక్కర్ స్కాం లో ఉన్నది నిజం, జైలుకి వెళ్లడం ఖాయం. నిన్ను మీ అన్న మీ నాయనా ఎవ్వరు కాపాడలేరు. మునుగోడు ఉప ఎన్నికలలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక @KTRTRS(#TwitterTillu) ఇంకా మీ తెరాస నాయకులు పారదర్శకరంగా టెండర్ ద్వారా వచ్చిన 18000 కోట్ల 1/2 https://t.co/xKfidkDslc
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) December 21, 2022
సోషల్ మీడియాలో తనపై ఆరోపణలు చేస్తున్న ప్రముఖులకు.. కవిత కౌంటర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్‌కూ కవిత కౌంటర్ ఇచ్చారు.
.@manickamtagore Ji
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
The accusations on me are completely bogus and false. Only time will prove my sincerity.
It’s a political vendetta of BJP, as they fear BRS Party Chief CM KCR ji’s expose on their anti-farmer & pro-capitalist policies. https://t.co/JygENzO2hp