By: ABP Desam | Published : 26 Dec 2021 08:20 PM (IST)|Updated : 26 Dec 2021 08:35 PM (IST)
బండి సంజయ్(ఫైల్ ఫొటో)
సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిరుద్యోగ దీక్ష జరగనుంది. బీజేపీ కార్యాలయం ఆవరణలో నిరుద్యోగ దీక్ష చేయనున్నట్టు సంజయ్ ప్రకటించారు. దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ జీవో జారీ చేసిందని ఆపార్టీ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది.
తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు.. భర్తీ చేయాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. బండి సంజయ్ ఈ దీక్ష చేస్తున్నారు. మెుదట కమలం శ్రేణులు ఇందిరా పార్కు వద్ద దీక్షను ఏర్పాటు చేయాలని చూశారు. దీని కోసం.. అనుమతి ఇవ్వాలని పోలీసులను కూడా బీజేపీ నేతలు కోరారు. అయితే పోలీసులు వారి వినతిని తిరస్కరించారు. కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయని చెప్పారు.
ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న కారణంగా.. ఆంక్షలు విధించాలని హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. తెలంగాణలో జనవరి 2వ తేది వరకు ఆంక్షలు విధించనున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, పెద్ద ఎత్తున జనం గుమికూడడంపై ఆంక్షలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం బండి సంజయ్ చేపడుతున్న దీక్షకు..అనుమతి లేదని.. పోలీసులు చెప్పారు. దీంతో నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి దీక్ష వేదిక మారింది.
Koo Appకొమార్బిడిటీలు ఉన్న వారు, 60 ఏళ్లు పైబడిన వారు వైద్యుల సిఫార్సుపై,10జనవరి, 2022 నుండి ముందు జాగ్రత్త మోతాదుకు అర్హులు 60 वर्ष से ऊपर की आयु के कॉ-मॉरबिडिटी वाले नागरिकों को, उनके डॉक्टर की सलाह पर वैक्सीन की Precaution Dose का विकल्प उनके लिए भी उपलब्ध होगा। —PM Sh @narendramodi - Arvind Dharmapuri (@arvinddharmapuri) 25 Dec 2021
నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష
తెలంగామ బీజేపీ చేపడుతున్న దీక్షపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలది నిరుద్యోగ దీక్ష కాదని.. సిగ్గు లేని దీక్ష అని విమర్శించారు. బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చాక.. ఎన్నికోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతను నిలువునా ముంచిందని ఆరోపించారు. బండి సంజయ్‌కి దమ్ముంటే దీక్షను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేయాలని సవాల్ విసిరారు.
Also Read: KTR: నీకు నిబద్ధత ఉంటే ఇందిరా పార్కు సాక్షిగా ముక్కు నేలకు రాయి.. వివరణ ఇవ్వు: కేటీఆర్
Also Read: Jammalamadaka Pichaiah: తొలితరం బ్యాడ్మింటన్ క్రీడాకారుడు అర్జున పిచ్చయ్య కన్నుమూత...
Also Read: ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు.. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో కొత్త వేరియంట్ నిర్ధారణ
Online Bettings Suicide : ఆన్లైన్ బెట్టింగులకు మరో ప్రాణం బలి, అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య
Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి
Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!
Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 4 రోజులు వానలే! నేడు ఈ జిల్లాల వారికి అలర్ట్
Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?