IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Bandi Sanjay: బీజేపీ రాగానే టీఆర్ఎస్‌లో అందరికీ రక్త పరీక్షలు, నాది గుండైనా ఆ సంస్కృతి కాదు: బండి సంజయ్

ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డిలో పాదయాత్ర చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మీదుగా ఆయన యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి చేరుకుంది.

FOLLOW US: 

బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు అద్భుతమైన స్పందన వస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. తన యాత్రకు ప్రజలంతా సహకరిస్తున్నారని వెల్లడించారు. వినాయక మండపాలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని చెబుతున్నారని.. హిందువుల పండుగలకే అనుమతులు తీసుకోవాలా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బహిరంగ సభలకు లేని ఆంక్షలు హిందువుల పండగలకే ఎందుకు ఉంటున్నాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని బండి సంజయ్‌ అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సంగారెడ్డిలో పాదయాత్ర చేశారు.  హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల మీదుగా ఆయన యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి చేరుకుంది.

ఈ సందర్భంగా శివంపేటలో బండి సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘‘ఎల్లుండి వినాయకచవితి. తెలంగాణలో హిందువులు.. పండుగలు చేసుకోవాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో హిందువులు దీన స్థితిలో ఉన్నారు. వినాయక విగ్రహం ఎక్కడ పెడతారు. ఎంత ఎత్తు షెడ్​ వేస్తారు. పర్మినెంట్ షెడ్డా? లేక తాత్కాలిక షెడ్డా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దాని కోసం యాప్​ కూడా తయారు చేశారు.’’ అని విమర్శించారు. హిందువుల పండగలతో చెలగాటం ఆడితే సహించేది లేదని డీజీపీని బండి సంజయ్ హెచ్చరించారు.

‘‘ప్రజా సంగ్రామ యాత్రలో ప్రజలు, రైతులు తమ బాధలు చెప్పుకుంటున్నారు. రైతులకు కనీస మద్దతు ధర లేదు. పండ్లు, కూరగాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు కూడా లేవు. చెరకు రైతులకు కనీస ధర కూడా దొరకడం లేదు. రైతులను పట్టించుకోకుండా ఢిల్లీకి పోయి కేసీఆర్ కూర్చున్నాడు. తెలంగాణ రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలం అవుతోంది. రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలేదు. టీఆర్ఎస్ ఏడేళ్ల కాలంలో పంట నష్టపరిహారం ఇచ్చి, రైతును ఆదుకున్న దాఖలాలు లేవు. సంగారెడ్డి ప్రాంతంలో ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు వచ్చిన దాఖలాలు లేవు. రైతుగా మారిన కేసీఆర్ అని తుపాకీ రాముడు టోపి పెట్టుకుని, కర్ర పట్టి కేసీఆర్ ఫోజులిస్తడు. తెలంగాణలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు ఇచ్చింది. అయినా ఇక్కడ భూసార పరీక్షలు చేయించడం లేదు’’

‘‘లక్ష మందితో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తే కోవిడ్ రాదా..? పర్మిషన్ తీసుకుని పండుగలు చేసుకుంటే కోవిడ్ రాదా..? పండుగలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు సీఎం, డీజీపీ సహకరించాలని కోరుతున్నా. హుస్సేన్ సాగర్ (వినాయక్ సాగర్) లో నిమజ్జనం జరిపి తీరుతాం. దమ్ముంటే అడ్డుకోండి. హైకోర్టులో పిటిషన్ వేయించిన ఘనత కేసీఆర్‌ది. ప్రతీసారి హిందువుల పండుగలు అంటేనే ఆంక్షలు వస్తాయి. సంగారెడ్డి జిల్లాలో బీర్ ఫ్యాక్టరీలు వదిలే నీళ్లతో మంజీరా నది జలాలు కలుషితం అవుతున్నాయి. ఇది మీకు గుర్తుకు రావడం లేదా?’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.

నాది గుండు.. నీలా విగ్గు పెట్టుకోను
‘‘నాది గుండే.. నాకు ఉన్నది గుండు మాత్రమే.. నీలాగా విగ్గు పెట్టుకునే సంస్కృతి కాదు. నా అందాన్ని విమర్శించే వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో నాకు తెలియదా? నిన్ను, నీ యాక్టింగ్‌ను చూసి యాక్టర్సే సిగ్గు పడుతున్నారు. రేవంత్ రెడ్డి పొట్టోడే.. పొడుగు అని ఏమైనా చెప్పుకుంటుండా కేటీఆర్? టీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ వాడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే టీఆర్ఎస్ వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహిస్తాం’’ అని బండి సంజయ్ కేటీఆర్‌ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. 

Published at : 08 Sep 2021 06:10 PM (IST) Tags: cm kcr Bandi Sanjay sangareddy praja sangrama yatra tollywood drugs case bandi sanjay on kcr

సంబంధిత కథనాలు

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య -  రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

Hyderabad Honour Killing Case: అవమానం తట్టుకోలేని సంజన ఫ్యామిలీ, పక్కా ప్లాన్‌తో నీరజ్‌ పరువు హత్య - రిమాండ్ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇవే

Breaking News Live Updates: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి కలకలం, పెద్దమొత్తంలో పట్టుకున్న పోలీసులు

Breaking News Live Updates: హైదరాబాద్‌లో మరోసారి గంజాయి కలకలం, పెద్దమొత్తంలో పట్టుకున్న పోలీసులు

Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు

Karimnagar: ఇంటి కింద 4 కోట్లు! వాటి కోసం క్షద్రపూజలు, తెలివిగా నమ్మించి బురిడీ కొట్టించిన దొంగ బాబాలు

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !

Rajanna Sircilla: కలెక్టర్‌ పేరుతో ఫేక్ వాట్సాప్‌ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

MLA Food: దళిత వ్యక్తి నోట్లోని అన్నం తీయించి ఎంగిలి తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే - వీడియో వైరల్

Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!

Kushi Update: 'ఖుషి' కశ్మీర్ షెడ్యూల్ పూర్తి - నెక్స్ట్ హైదరాబాద్ లోనే!

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!

Viral News: తాళి కట్టే టైంలో స్పృహ తప్పిన వధువు- తర్వాత ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి పోలీసులు ఎంట్రీ!