Etala Notice : మళ్లీ తెరపైకి ఈటల భూ వ్యవహారం .. నోటీసులు జారీ చేసిన అధికారులు !
ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హ్యాచరీస్ భూముల విషయంలో అధికారులు మరోసారి చర్యలు ప్రారంభించారు. సర్వే నోటీసులు జారీ చేశారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జమున హ్యాచరీస్ పేరుతో భూములను కొనుగోలు చేసినందున ఆ కంపెనీని నిర్వహిస్తున్న ఈటల సతీమణి జమునతో పాటు కుమారుడు నితిన్ రెడ్డికి ఈ నోటీసులు జారీ చేశారు. మెదక్ జిల్లా హకీంపేటలో సర్వే నంబర్ 97లోని భూముల్లో సర్వే నిర్వహించనున్నామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈనెల 18న సర్వేకు హాజరుకావాలని తూప్రాన్ ఆర్డీవో నోటీసుల్లో కోరారు.
Also Read : హీరో మీరంటే మీరు .. కేటీఆర్ , సోనూసూద్ పరస్పర ప్రశంసలు ! ఎక్కడో తెలుసా ?
ఈటల రాజేందర్ తమ భూములు లాక్కున్నారంటూ కొంత మంది లేఖలు రాయడంతో దానిపై సీఎం కేసీఆర్ హుటాహుటిన విచారణకు ఆదేశించారు. జూలై నెలాఖరులో ఫిర్యాదులు రాగానే అధికారులు వెంటనే రంగంలోకి దిగిన మెదక్ కలెక్టర్ మే 1, 2న జరిగిన విచారణ జరిపి వెంటనే నివేదిక ఇచ్చారు. ఆ నివేదికపై జమున హ్యాచరీస్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. తమ భూముల్లోకి అక్రమంగా ప్రవేశించారని.. ఎలాంటి నోటీసులివ్వకుండా విచారణ చేపడుతున్నారని జమునా హ్యాచరీస్ సంస్థ ఆరోపించింది. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయకపోవడంతో మెదక్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. సరైన పద్ధతిలో నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని ఆదేశించింది.
Also Read : గంటసేపు కేసీఆర్ అబద్ధాలు.. అవన్నీ నిజమని తేల్చు, నేనే ముక్కు నేలకు రాస్తా: బండి సంజయ్
నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని ఆదేశించింది. ఈ వ్యవహారంలో అధికారులు ఉల్లంఘనకు పాల్పడ్డారని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తీర్పు తర్వాత మళ్లీ ఇప్పుడే సర్వే చేస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకూ సమయం ఇచ్చారు. అప్పుడు సర్వే చేసి అక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయో లేదో తేల్చనున్నారు.
Also Read: కేసీఆర్‌ని టచ్ చేసి బతికి బట్టకడతారా... రేపట్నుంచి కేంద్రానికి చుక్కలు చూపిస్తాం....
ఈటల రాజేందర్ అక్రమాలకు పాల్పడ్డారని అసైన్డ్ భూములను గుంజుకున్నారని కలెక్టర్ ఇచ్చిన ఇచ్చిన నివేదిక ఆధారంగా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ నుంచి మొదటగా శాఖలు కత్తిరించారు. ఆ తర్వాత మంత్రి పదవిని ఒక రోజు తేడాతో తొలగించారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం.. ఉపఎన్నికలు రావడం ..మళ్లీ అందులో గెలవడం వరుసగా జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఆ భూముల అంశం తెరపైకి వచ్చింది.
Also Read: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం