News
News
X

Khammam BRS Meeting : ఖమ్మం వేదికగా మారుమోగనున్న బీఆర్ఎస్ నినాదం - ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తి !

ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రాజకీయల్లో ఈ సభ ద్వారా సంచలనం సృష్టించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

FOLLOW US: 
Share:

Khammam BRS Meeting :   ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్‌ఎస్‌ నుంచి జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా రూపాంతరం చెందిన తర్వాత సొంతగడ్డ తెలంగాణపై నిర్వహిస్తున్న తొలి సభ ఇదే.  . పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాల కార్యాచరణను ప్రకటించనున్నారు.  బహిరంగసభకు సీఎం కేసీఆర్‌, మరో ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ సీఎం, సీపీఐ, సీపీఎం పార్టీల ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. ఖమ్మంలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ దేశంలో బీజేపీయేతర పార్టీల బలానికి, బీఆర్‌ఎస్‌ నిర్మాణశక్తిని చాటాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.  బీఆర్‌ఎస్‌ వెంట వస్తున్న ఎస్పీ, ఆప్‌, సీపీఐ, సీపీఎం సహా అనేక పార్టీలను ఏకం చేయగల సత్తా సీఎం కేసీఆర్‌కు ఉన్నదని బీఆర్ఎస్ వర్గాలు ఈ వేదికగా సందేశం ఇవ్వనున్నారు. 
  
‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ అనే నినాదంతో బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలు చేస్తోంది.    ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) బహిరంగసభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు సీఎం కేసీఆర్‌తోపాటు మూడు రాష్ర్టాల సీఎంలు, యూపీ మాజీ సీఎం, ఇతర ముఖ్య నేతలు రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణకు ఏడుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను నియమిస్తూ డీజీపీ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 18న సీఎం కేసీఆర్‌ ముందుగా ఖమ్మం సమీకృత కలెక్టరేట్‌ను, తరువాత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం మెడికల్‌ కళాశాలకు శంకుస్థానన చేస్తారు. అనంతరం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో పాల్గొంటారు. కలెక్టరేట్‌ ప్రారంభం, బహిరంగ సభ బందోబస్తును వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షిస్తారు. రూట్‌ బందోబస్తు, ట్రాఫిక్‌, పార్కింగ్‌ ప్రాంతాలతోపాటు లా అండ్‌ ఆర్డర్‌ వంటి వాటిని మల్టీజోన్‌-2 ఐజీపీ షానవాజ్‌ ఖాసీం పర్యవేక్షిస్తారు. మొత్తం కార్యక్రమ ఇన్‌చార్జులుగా మల్టీజోన్‌-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ విష్ణు ఎస్‌ వారియర్‌ వ్యవహరించనున్నారు. ఐజీపీ షానవాజ్‌ ఖాసీం నిర్వహించే కార్యక్రమాలకు గద్వాల జోగులాంబ జోన్‌ డీఐజీ చౌహన్‌ను సహాయకుడిగా నియమించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి నిర్వహించే విధులకు రాజన్న సిరిసిల్ల జోన్‌ డీఐజీ కే రమేశ్‌నాయుడు సహాయకుడిగా ఉంటారు. అవసరమైన బందోబస్తు బృందాలను అడిషనల్‌ డీజీపీ విజయ్‌కుమార్‌ ఏర్పాటు చేస్తారు. వీరంతా సోమవారం నుంచే ఖమ్మంలో విధులు నిర్వర్తించాలని డీజీపీ ఆదేశించారు. 

 కేసీఆర్‌ పర్యటన, బహిరంగ సభ నిమిత్తం పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్‌లు ఏర్పాటు చేశారు. మీటింగ్ వచ్చే ప్రజలు పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు నిలిపి మీటింగ్ స్థలానికి చేరుకోవచ్చు. భారీ వాహనాలు వెళ్లే హైవే లో లారీలు, హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే డీసీఎంలు బోనకల్ చిల్లకల్లు వైపు మ‌ళ్లించ‌నున్నారు.   ఖమ్మం టౌన్‌లో భారీ వాహనాలను అనుమతించడం లేదు. ఖమ్మం వెళ్లే వాహనాలను తిమ్మరావుపేట, ముచ్చర్ల ఎక్స్ రోడ్డు-ఎన్టీఆర్ సర్కిల్ వైపు మ‌ళ్లించ‌నున్నారు. భారీ వాహనాలను ఖమ్మం రోడ్డుకు అనుమతించడం లేదు. కావున ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలందరూ వేరే మార్గాల ద్వారా మీ గమ్యాన్ని చేరుకోవాల్సిందిగా  పోలీసులు సూచిస్తున్నారు. 

Published at : 17 Jan 2023 04:23 PM (IST) Tags: BRS KCR BRS Avirbhava Sabha Khammam Sabha

సంబంధిత కథనాలు

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం  

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి- తెలుగు సినీరంగానికి తీరన లోటని కామెంట్‌!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

Telangana Assembly Budget Sessions : ఈరోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం!

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్‌పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

K Viswanath : హిందీలోనూ విశ్వనాథ్ హిట్టే, ఆయన 'స్వయంకృషి' - ఓ తీరని కోరిక

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan Marriages: మూడు పెళ్లిళ్ల వివాదంపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ - చివర్లో బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!

K.Viswanath: చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!