Breaking News Live Updates: ఇది కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర: రేవంత్ రెడ్డి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 28న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
ఏపీ సచివాలయంలో గురువారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 20 నుంచి 25 అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చిస్తారు. రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఆహ్వానితులకు ప్రభుత్వం అవకాశం కల్పించనుంది. తితిదేతో పాటు, వీటికి కూడా వర్తించేలా దేవాదాయశాఖ చట్టాన్ని సవరించేందుకు రంగం సిద్ధం చేసింది. మంత్రివర్గ సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఇది కేసీఆర్, జగన్ ల ఉమ్మడి కుట్ర: రేవంత్ రెడ్డి
కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, ఏపీ మంత్రి పేర్ని నాని “సమైక్య రాష్ట్ర” ప్రతిపాదన తేవడం, కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర అని ఆరోపించారు. వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! అని రేవంత్ రెడ్డి అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోంది.
— Revanth Reddy (@revanth_anumula) October 28, 2021
ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం…మంత్రి పేర్ని నానీ “సమైక్య రాష్ట్ర”
ప్రతిపాదన తేవడం…
కేసీఆర్, జగన్ ల “ఉమ్మడి” కుట్ర.
వందల మంది ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్…! pic.twitter.com/Is4fDy8Okk
ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ రజనీ కాంత్..!
సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆరోగ్యమా, లేక ఇతర కారణమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.





















