News
News
X

Breaking News Live Telugu Updates: ఈ 12న భద్రాద్రి కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ఈ 12న భద్రాద్రి కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ మళ్లీ జిల్లాల్లో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్లకు ప్రారంభించనున్నారు ఈ నెల 12న ఉదయం మహబూబాబాద్‌ జిల్లా, మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి, సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు

ముగిసిన చంద్రబాబు - పవన్ కళ్యాణ్ భేటీ

ముగిసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు కార్మికులు మృతి

సంగారెడ్డి జిల్లాలో మైలన్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.

ముగ్గురు కార్మికులు మృతి. మరి కొందరికి గాయాలు.

జిన్నారం మండలం గడ్డిపోత ప్రాంతాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతుల్లో అసిస్టేట్ మేనేజర్ కోటేశ్వరరావు, సంతోష్, రంజిత్ మృతి.

గాయపడిన పలువురికి చికిత్స నిమిత్తం హైదరాబాద్లో ఆసుపత్రికి తరలింపు

AP BJP: హత్యా రాజకీయాలకు కారకులైన వారిపై చర్యలేవి? - బీజేపీ

హత్యా రాజకీయాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలం బీజేపీ నేత శివ కుమార్ గౌడ్ దారుణ హత్యకు గురైన ఘటనలో దోషులను వెంటనే అరెస్టు చేయాలని అన్నారు. బీజేపీ నేత హత్య సంఘటనలు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. రాయలసీమలో శాంతి భద్రతలపై హోంమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Chandrababu - Pawan Kalyan Meet: కాసేపట్లో చంద్రబాబు పవన్ కల్యాణ్ భేటీ

ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరికాసేపట్లో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల మధ్య పొత్తులు వంటి అంశాలపై వీరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Road Accident: హైదరాబాద్ విజయవాడ మార్గంలో ఘోర ప్రమాదం, ముగ్గురు మృతి

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు శివారులో ఎరసాని గూడెం దగ్గర అదుపు తప్పి ఇన్నోవా కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు నార్కట్‎పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‎లో వలీమా ఫంక్షన్‎కు హాజరై తిరిగి ఖమ్మం వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతులు ఎండి ఇద్దాక్ (21) ఎస్ కే.సమీర్ (21) ఎస్ కే.యాసీన్ (18) గా గుర్తించారు. వీరంతా ఖమ్మం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.

Background

ఉత్తర భారత దేశాన్ని గత వారం పాటు గజగజ వణికించిన చలి, ఇప్పుడు నేరుగా దక్షిణ భారత దేశం వైపుగా వస్తోంది. దీని వలన తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అలాగే మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం చలి తీవ్ర రూపాన్ని దాల్చనుంది. జనవరి 12 వరకు చలి తీవ్రత మరింత ఎక్కువ కానుంది. సాయంకాలం 4 గంటల నుంచే చలి ప్రారంభించి, తెల్లవారుజామున 10 వరకు కొనసాగనుంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా చల్లటి వాతావరణం ఉండనుంది. కొన్ని ప్రదేశాల్లో 5 నుంచి 12 డిగ్రీల వరకు పడిపోయే పరిస్ధితి ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

విశాఖ నగరంలో 15 నుంచి 17 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలని ఎదురు చూడవచ్చు. అలాగే కాకినాడ​, కొనసీమ, కృష్ణా, ఎన్.టీ.ఆర్. , గుంటూరు, పల్నాడు, బాపట్ల​, తూర్పు గోదావరి జిల్లాల్లో చలి తీవ్రత ఉంటుంది. విజయవాడలో 13 నుంచి 15 మధ్యలో ఉష్ణోగ్రతలు ఉండనుంది. ప్రకాశం జిల్లాలో కూడ చలి తీవ్రత ఉంటుంది. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడ చలి తీవ్రత ఉండనుంది. నంద్యాల జిల్లాలో అత్యధిక చలి తీవ్రత అత్యథికంగా ఉండనుంది. కడప​, అన్నమయ్య​, కర్నూలు, అనంత​, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో కూడ చలి తీవ్రత ఉండనుంది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం చలి సాధారణంగా ఉంటుంది. రాయలసీమకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మిగిలిన భాగాల్లో ఉండదు.

ఉత్తరాదిన కూడా అదే పరిస్థితి
మరోవైపు, దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలిగాలులు పెరిగాయి. రాజధాని ఢిల్లీతో పాటు హరియాణా, చండీఘడ్, అమృతసర్ ప్రాంతాల్లో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని భారత వాతావరణ విభాగం హెచ్చరిక చేసింది. ఢిల్లీలో సోమవారం ఉదయం కనిష్ఠ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్షియస్ అని నమోదు అయింది.

పంజాబ్, హరియాణా - చండీగఢ్ - ఢిల్లీ, ఉత్తర రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్ లోని సౌరాష్ట్ర, కచ్ మీదుగా చలిగాలుల పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణ వాతావరణం
తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి వచ్చే 3 రోజుల పాటు పొడి వాతావరణంగానే ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కానీ, తెలంగాణలో శీతల గాలుల కారణంగా విపరీతంగా చలి పెరిగింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రేపు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కేవలం దక్షిణ తెలంగాణలో 6 లేదా 7 జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరికలు చేయలేదు.

హైదరాబాద్ లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 17 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న 26.2 డిగ్రీలు, 18.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

టాప్ స్టోరీస్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Anil Kumar On Kotamreddy : దమ్ముంటే రాజీనామా చెయ్, కోటంరెడ్డికి అనిల్ కుమార్ సవాల్

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Pawan Kalyan: రోడ్డు మీద వాంతి చేసుకుంటే బాబాయ్ క్లీన్ చేశారు - చరణ్ ఫోన్‌కాల్‌లో పవన్ గురించి ఏం అన్నారు?

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన మలుపు, ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్, కవిత, మాగుంట పేర్లు

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్

YS Sharmila Gift To KCR : సీఎం కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ పంపిన షర్మిల, ఒక్కరోజు పాదయాత్ర చేయాలని సవాల్