Breaking News Live Telugu Updates: రాజీనామాకు సిద్ధమని మహారాష్ట్ర సీఎం ప్రకటన
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
నైరుతి రుతుపవనాలు విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉన్న ఉపరితల అల్పపీడన ద్రోణి దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సైతం ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. తెలంగాణలో ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని జిల్లాల్లో తెల్లవారుజామున వర్షం కురవగా, కొన్ని చోట్ల రాత్రిళ్లు వర్షాలు కురుస్తున్నాయి. ఒకట్రెండు జిల్లాల్లో వర్ష సూచన కనిపించడం లేదు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురంమన్యం జిల్లాల్లోని మొత్తం 41 మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తల నిర్వహణ సంస్థ ఇటీవల హెచ్చరించింది. భారీ వర్షం కురిసే సమయంలో పాత ఇళ్లల్లో ఉండవద్దని, చెట్ల కిందకు వెళ్ల వద్దని ప్రజలకు సూచించారు.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. విశాఖతో పాటుగా అనకాపల్లి, కాకినాడ జిల్లాలోని కొన్ని భాగాలు, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కొనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో వర్షాలు నేడు పెరుగుతాయి. కాకినాడ నగరంతో పాటుగా యానం, పిఠాపురం, అన్నవరంలో కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా నుంచి భారీ వర్షాలు విస్తరిస్తున్నాయి. కాకినాడ, రాజమండ్రిలో తేలికపాటి జల్లులు పడేతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
కోస్తాంధ్రలో వర్షాలు మరింత ఎక్కువ కానుండగా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. గుంటూరు, పల్నాడు, విజయవాడ, సాయంకాలానికి కడప, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలుంటాయి. ఈ రోజు అర్ధరాత్రి కూడ రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. వర్షాలతో రైతుల పంట, ధాన్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని సూచించారు. భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్షాలు
రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల పడతాయని పేర్కొంది.
థాక్రే సీఎంగా వద్దని చెబితే ఇప్పుడే రాజీనామా చేస్తాను: ఉద్దవ్ థాక్రే
తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే. ఉద్దవ్ సీఎంగా వద్దంటే ఇప్పుడే చేస్తానన్నారు. రాజీనామా లేఖను రెడీ చేయిస్తానని... గవర్నర్‌కు పంపించాలని చెప్తానన్నారు. ట్వీట్‌లు, ట్రోలింగ్స్ తాను స్పందించబోనన్నారు ఉద్దవ్. పదవులు వస్తాయి పోతాయని అన్నారు. వాటి కోసం తాము ఎప్పుడూ లెక్క చేయలేదన్నారు.
ఇక్కడే నాతో మాట్లాడ వచ్చు కదా- సూరత్ వెళ్లి ఎందుకు మాట్లాడుతున్నారు?: థాక్రే
కాంగ్రెస్ ఎన్సీపీ సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు. కమల్‌నాథ్ శరద్‌పవార్ మాట్లాడారు. ఇద్దరు శివసేన వెంట ఉంటామన చెప్పారన్నారు. తమ పార్టీ వాళ్లే మోసం చేస్తారని అనుకోలేదన్నారు థాక్రే. వ్యతిరేకించేవాళ్లు సూరత్ వెళ్లి ఎందుకు మాట్లాడాలి... ఇక్కడే నాతో మాట్లాడవచ్చు కదా.. శివసేనను మోసం చేయనూ అని చెబుతూ ఇప్పుడు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు.
మాకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు: ఉద్దవ్ థాక్రే
మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం ఉద్దవ్ థాక్రే. ఇవాళ నాకు కరోనా వచ్చినట్టు తేలింది. కరోనా ఉన్నప్పటికీ లక్షణాలు ఏమీ లేవు. సీఎం పదవిని నిజాయితీగా నిర్వహించాను. టాప్ 5 సీఎంలలో మహారాష్ట్ర సీఎం ఉన్నారు. చెప్పేందుకు చాలా మాటలు ఉన్నాయి. శివసేన సేన హిందుత్వం రెండూ కలిసే ఉన్నాయి.
హిందత్వం గురించి చాలా మాట్లాడుతున్నారు. ప్రజలను కలవడం లేదని అసత్య ప్రచారం చేస్తున్నారు. హిందుత్వ ఎజెండాకు శివసేన కట్టుబడి ఉంది. హిందుత్వం వదిలేసిందన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. మాకు 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యేలు అటుపోయారు.. ఇటుపోయారు అంటున్నారు. దానిపై నేనేమీ మాట్లాడను. కాంగ్రెస్, ఎన్సీపీలతో చాలా ఏళ్లు పోరాటం చేశాం. కానీ అందరం కలిసి మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేశాం.
శివసేన, హిందుత్వ రెండూ కలిసే ఉన్నాయి: ఉద్దవ్ థాక్రే
మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సీఎం ఉద్దవ్ థాక్రే. ఇవాళ నాకు కరోనా వచ్చినట్టు తేలింది. కరోనా ఉన్నప్పటికీ లక్షణాలు ఏమీ లేవు. సీఎం పదవిని నిజాయితీగా నిర్వహించాను. టాప్ 5 సీఎంలలో మహారాష్ట్ర సీఎం ఉన్నారు. చెప్పేందుకు చాలా మాటలు ఉన్నాయి. శివసేన సేన హిందుత్వం రెండూ కలిసే ఉన్నాయి.
Palnadu District News: షటిల్ ఆడుతూ కుప్పకూలి యువకుడు మృతి
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో షటిల్ ఆడుతూ గ్రౌండ్ లోనే కుప్పకూలి ఓ యువకుడు మృతి చెందాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన బేతంచెర్ల కిషోర్ తన స్నేహితులతో కలిసి షటిల్ ఆడేందుకు గుర్రాల చావిడి వద్ద ఉన్న ఇండోర్ స్టేడియంకి వెళ్లారు. షటిల్ ఆడుతూ కిశోర్ ఒక్క సారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందాడని డాక్టర్ తెలిపారు. అప్పటిదాకా తమతో కలిసి ఉన్న మిత్రుడు లేదనే విషయం స్నేహితులను కలవరానికి గురి చేసింది.