Breaking News Live Telugu Updates: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది మా స్టాండ్: మంత్రి అమర్నాథ్
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
తూర్పు నుండి వీచే గాలులలో ఏర్పడిన ద్రోణి ఈ రోజు కేరళ నుండి అంతర్గత కర్నాటక, మరఠ్వాడా మీదుగా విధర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరియు ఆగ్నేయం నుండి కింది స్థాయిలో గాలులు వీస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలు:
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పాడే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది.
Weather Warnings: వాతావరణ హెచ్చరికలు
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా తక్కువ స్థానాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీలు, 25 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 68 శాతం నమోదైంది.
ఏపీలో వర్షాలు ఇలా
‘‘నేడు రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నమోదవనుంది. ప్రస్తుత పరిస్ధితులను గమనించినట్లు అయితే అధిక పీడన ప్రాంతం తెలంగాణ మీదుగా కొనసాగుతోంది. దీని వలన రాయలసీమ జిల్లాల్లో వేడి గాలులు విస్తారంగా మధ్యాహ్నం, సాయంకాలం కొనసాగుతుంది కాబట్టి, నంధ్యాల, కర్నూలు, కడప, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో వేడి గాలులు కొనసాగనుంది. కానీ కోస్తాంధ్రలో కాస్త భిన్నంగా ఉండనుంది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, ఎన్.టీ.ఆర్., కొనసీమ, కృష్ణ, ప్రకాశం జిల్లాలోని తూర్పు భాగాలు, నెల్లూరు జిల్లాలోని తూర్పు భాగాలు, తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నేడు నమోదుకానున్నాయి.
రాయలసీమలో ఎండలు విపరీతంగా
రాయలసీమ వ్యాప్తంగా వేడి విపరీతం అయింది. నేడు అత్యధికంగా కర్నూలు నగరంలో 41.5 డిగ్రీలు నమోదయ్యింది. నేడు కూడా భారత దేశంలో ఎండలలో మొదటి స్ధానంలో కర్నూలు నిలుస్తోంది. మరోవైపున అధికపీడన ప్రాంతం కొనసాగుతోంది కాబట్టి రాయలసీమ జిల్లాల్లో వేడి రానున్న రోజుల్లో పెరగనుంది. జాగ్రత్తలు తీసుకోగలరు’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాలపై ప్రభావం తక్కువే - ఐఎండీ
రానున్న ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మీదుగా వేడిగాలులు వీచే అవకాశమున్నట్లు తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొంది. ఏప్రిల్- జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ ప్రాంతంతో పాటు, దక్షిణ భారత దేశంలో ఎండలు లేదా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ కొద్ది రోజుల క్రితమే తెలిపింది.
వాతావరణ విభాగం వివరాల మేరకు.. పశ్చిమ్ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండకపోవచ్చని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది మా స్టాండ్: మంత్రి అమర్నాథ్
శ్రీకాకుళం జిల్లా.... ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ కామెంట్స్* ...
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దన్నది మా స్టాండ్...
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీలు లేదు అని కేసిఆర్ అనే వ్యక్తి చెప్పారన్నప్పుడు మళ్ళీ వాల్లు కొoటాము అనడమెందుకు
అంటే అమ్మెయ్యమని వారి ఉద్దేశమా...
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిoచటానికి వీలు లేదు అని కేసిఆర్ అనే వ్యక్తి చెప్పినప్పుడు...మళ్ళీ వాల్లు కొoటామనీ అనడమెందుకు
అంటే అమ్మెయ్యమని వారి ఉద్దేశమా...
స్టీల్ ప్లాంట్ పై మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ తప్ప ఇంతవరకు KCR నుండి గాని,తెలంగాణ ప్రభుత్వం నుండి గాని అధికారిక స్టేట్మెంట్స్ వినలేదు
వాళ్ళ స్టాండ్ ఏంటో క్లారిటీ రావాలి...వాళ్ళ స్టాండ్ ఏంటో తెలియకుండా నేను ఏమి మాట్లాడుతాను
రాజకీయాల కోసం వాల్లు వీవేవో మాట్లాడుతారు...
Tirumala News: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారిని నైవేద్య విరామ సమయంలో పాండిచ్చేరి మినిస్టర్ చంద్ర ప్రియాంక, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, ఆర్మీ వెస్ట్రన్ కమాండర్ చీప్ నవ్ కె కందురి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
Palakonda News: పాలకొండ మండలం NK రాజపురం గ్రామంలో దారుణం
- పాలకొండ మండలం NK రాజపురం గ్రామంలో దారుణం
- గ్రామ సమీపంలోని బహిర్బూమి వద్ద ఇరువురు వ్యక్తులు శివశంకర్ (20) మోహన్ రావు (21) ఇద్దరు వ్యక్తుల మద్య మాటమాట పెరిగి చోటు చేసుకున్న ఘర్షణ
- తాగిన మైకంలో మోహన్ రావుపై దాడి చేసిన చందక శివశంకర్
- అనంతరం మోహన్ రావు ఇంటి లోపలకు ప్రవేశించిన శివశంకర్, కుటుంబీకులు
- మోహన్ రావు ఇంటిలోని గృహోపకరణాలు ద్వంసం చేసి అడ్డువచ్చిన మోహన్ రావు తండ్రి చంద్రరావుపై దాడి చేసిన శివ శంకర్ కుటుంబీకులు
- దాడిలో చంద్రరావుకు తీవ్ర గాయాలు
- తొలుత పాలకొండ ఏరియా ఆసుపత్రికి వైద్యం నిమిత్తం చంద్రరావు తరలింపు
- మొరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ కు తరలింపు
- రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రరావు (52) మృతి
- మృతుడికు న్యాయం చేయాలంటూ మృత దేహంతో పాలకొండ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న వందలాది మంది గ్రామస్తులు
bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. మే 3న ఈ ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. సీఎం జగన్‌కు దీనికి శంకుస్థాపన చేయనున్నారు.
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేడు 8 విమానాలు రద్దు
శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేడు రాకపోకలు సాగించాల్సిన ఎనిమిది విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ - తిరుపతి, హైదరాబాద్ - బెంగుళూరు, హైదరాబాద్ - విశాఖపట్నం, హైదరాబాద్ - మైసూర్, హైదరాబాద్ - చెన్నై, తిరుపతి - హైదరాబాద్, బెంగుళూరు - హైదరాబాద్, చెన్నై - హైదరాబాద్ సర్వీసులను రద్దు చేసినట్లుగా ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. ఆపరేషన్ కారణాల వల్ల ఈ ఎనిమిది విమానాలు రద్దయినట్లు ఆధికారులు ప్రకటించారు. విమానాలు రద్దు కావడంతో ఎయిర్ పోర్టులో ప్రయాణికులు అందోళన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా విమానాలను రద్దు చేయడం పట్ల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.