(Source: ECI/ABP News/ABP Majha)
Breaking News Live: రోడ్డు ప్రమాదంలో హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు మృతి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు వెళ్లిపోయారు. నిన్న (నవంబర్ 30, 2021) కిమ్స్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ నెల 22న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. మధ్యలో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే... కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. మళ్లీ సోమవారం 'సిరివెన్నెల' పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒక్క రోజు గడిచిందో... లేదో... ఆయన లేరనే వార్త వినాల్సి వచ్చింది.
అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల సీతారామ శాస్త్రి భౌతిక కాయాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. ఇక్కడ సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శిస్తున్నారు.
తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వ్యక్తి సిరివెన్నెల : సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరన్న వార్త కలిచివేసిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సాహితీ విరించి సీతారామశాస్త్రికి శ్రద్ధాంజలి ఘటించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ. సీతారామశాస్త్రి మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు : పవన్ కల్యాణ్
సీతారామశాస్త్రి మరణం కేవలం సినీ పరిశ్రమకే కాదు తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సిరివెన్నెలను కేవలం సినీ గీత రచయితగా చూడలేమని, ఆయన ఏ పాట రాసినా అందులో సాహిత్యం నిక్షిప్తమై ఉంటుందన్నారు. సిరివెన్నెలకు నివాళులు అర్పిస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు.
సిరివెన్నెల మృతిపై ప్రధాని మోదీ సంతాపం
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తనను బాధించిందన్నారు. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ ఉంటుందన్నారు. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు ప్రధాని మోదీ సంతాపాన్ని తెలియజేశారు.
తెలుగు భాషకు పట్టం కట్టిన వ్యక్తి సిరివెన్నెల : ఉపరాష్ట్రపతి వెంకయ్య
తెలుగు సినిమా గేయ రచయిత చేంబోలు సీతారామశాస్త్రి మృతి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన పరమపదించారని తెలిసి ఎంతో విచారించానన్నారు. తొలి సినిమా సిరివెన్నెల పేరునే ఇంటి పేరుగా మార్చుకుని తెలుగు భాషకు పట్టం కడుతూ సిరివెన్నెల రాసిన పాటలను అభిమానించే వారిలో తాను ఒకణ్ని అన్నారు.
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ సమీక్ష
రాష్ట్ర రవాణా శాఖపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీలతో అజయ్ కుమార్ తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రధానంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుపైనే చర్చిస్తున్నారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనను గత నెలలోనే సీఎం కేసీఆర్‌కు నివేదించామని ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్డినరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు, ఇతర బస్సుల్లో కిలోమీటర్‌కు 30 పైసలు పెంచాలని ప్రతిపాదించామని ఆయన వివరించారు.
రోడ్డు ప్రమాదంలో హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు మృతి
టాలీవుడ్ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఆర్ కల్యాణ మండపం హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి మృతి చెందాడు. సంబేపల్లె మండలం దుద్యాల వీరి స్వస్థలం.
ప్రకాశం జిల్లా మోపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్ కు మూడు చోట్ల గండి
ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు ప్రాజెక్ట్ రిజర్వాయర్ కు మూడు చోట్ల గండి పడింది. రిజర్వాయర్ కట్టలకు మూడుచోట్ల నుంచి నీళ్లు లీకవుతున్నాయి. విషయం తెలుసుకున్న మోపాడు, సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
సిరివెన్నెలకు అగ్ర నటులు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నివాళి..
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి టాలీవుడ్ అగ్రనటులు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. రాబోయే తరాలకు సిరివెన్నెల సాహిత్యం బంగారు బాటగా మారుతుందని ఎన్టీఆర్ అన్నారు. సిరివెన్నెల భౌతికకాయం వద్ద పవన్ కళ్యాణ్ కొద్దిసేపు అలాగే ఉండిపోయారు.
రోడ్డు ప్రమాదంలో హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు మృతి
టాలీవుడ్ యంగ్ హీరో అబ్బవరం కిరణ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఆర్ కల్యాణ మండపం హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి మృతి చెందాడు. సంబేపల్లె మండలం దుద్యాల వీరి స్వస్థలం.