అన్వేషించండి

Breaking News Live: గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తాం : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Andhra Pradesh Telangana news Updates Breaking News Live on January 31 monday Breaking News Live: గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తాం : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా 
ప్రతీకాత్మక చిత్రం

Background

అల్పపీడన ద్రోణి దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది.  తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా నేడు ఏపీలో వాతావరణం పొడిగా మారుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి గాలులలో ప్రజలు ఉదయం వేళ ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు తెలంగాణలోనూ చలి గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి.

రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం ఉన్నప్పటికీ కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నేడు వాతావరణం పొడిగా ఉంటుంది. వర్ష సూచన లేకపోవడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చునని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఉదయం వేళ చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయని, కొన్ని కోట్ల పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. 

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో నేడు వర్ష సూచన లేదు. ఈరోజు, రేపు వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాలు తగ్గడంతో రైతుల ధాన్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. సీమలో పలు చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదు కానున్నాయి. కొన్నిచోట్ల ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది. ఈశాన్యం నుంచి గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.

బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు స్థిరంగా ఉంది. ముందు రోజు తులానికి ఏకంగా రూ.150 తగ్గిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ.45,000 గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,100 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.65,500గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.

ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,000 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,500 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,000 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,100గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,500గా ఉంది.

18:10 PM (IST)  •  31 Jan 2022

గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేస్తాం : వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా 

గుంటూరు జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. జాతీయ జెండా ఎగుర వేసే సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పలుకుతామన్నారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా అందరి అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వ విధానం పాటుపడుతుందని ఎమ్మె్ల్యే ముస్తఫా అన్నారు. రాజకీయ లబ్ది కోసం  కొన్ని పార్టీలు ఏవేవో చేస్తున్నాయన్నారు. భారతదేశం కోసం ఎందరో ముస్లిం సోదరులు ప్రాణాలు అర్పించారన్నారు. గుంటూరు పట్టణంలోని జిన్నా టవర్ ను ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ మనోహర్ పరిశీలించారు. 

16:20 PM (IST)  •  31 Jan 2022

కడపలో విషాదం... ఇద్దరు యువతులు ఆత్మహత్యయత్నం, ఒకరు మృతి

కడప నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎర్రముక్కపల్లె సమీపంలో రైల్వే గేటు వద్ద ఇద్దరు యువతులు ఆత్మహత్యయత్నం చేశారు. సుజిత అనే అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందగా మరో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న యువతిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సంఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. ఘటనకు పాల్పడ్డ ఇద్దరు అనంతపురం జిల్లా యాడికి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్

వీడియోలు

World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20
Who is Jyothi Yarraji Empty Stadium Viral Video | ఎవరీ జ్యోతి యర్రాజీ ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tragedy in AP: ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
ఏపీలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, మరికొందరికి గాయాలు
Indian Railway Fare Hike: పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
పెరిగిన రైలు టికెట్ ఛార్జీలు.. నేటి అమల్లోకి.. ఎంత పెంచారంటే
Sankranti Holidays for Schools: విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. ఏపీలో సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
Rohit Sharma Golden Duck: విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్, స్టేడియం నుంచి వెళ్లిపోతున్న ఫ్యాన్స్
Money Saving Tips : 2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
2026లో డబ్బుల విషయంలో ఈ 5 తప్పులు అస్సలు చేయకండి.. పొదుపు, పెట్టుబడిపై కీలక సూచనలు ఇవే
Tata Punch EV: అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ దీని సొంతం
అత్యంత చౌకైన 5 సీటర్ ఎలక్ట్రిక్ SUV.. 6 ఎయిర్ బ్యాగ్స్ సహా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్
Vrusshabha Box Office Collection Day 1: వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
వృషభ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ - మోహన్ లాల్ మ్యాజిక్ పనిచేయలేదు... మొదటి రోజు మరీ ఇంత తక్కువా?
Indian Student Shot Dead: కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
కెనడాలో మరో దారుణం.. టొరంటోలో భారత విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
Embed widget