అన్వేషించండి

Breaking News Live: కరీంనగర్ లో బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: కరీంనగర్ లో బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

Background

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. మిసిసిపీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు దర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిసిసిపీ గల్ఫ్‌ పోర్ట్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు ఒక్కసారిగా పౌరులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు.

వాతావరణం
రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మళ్లీ తగ్గుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఇంకాస్త పెరిగింది. శనివారం ఆదిలాబాద్‌లో 13.2, మెదక్‌లో 17.3, నిజామాబాద్‌లో 17.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉంది. ఆగ్నేయ, తూర్పు దిశల నుంచి ఏపీ వైపు గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరోవైపు తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఇంకా తగ్గలేదు.

ఏపీ వెదర్ అప్‌డేట్స్..
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి. దక్షిణ కోస్తాంధ్రంలో నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చలి తీవ్రత తగ్గుతోంది.  

ఏపీలోని రాయలసీమ ప్రాంతానికి నేడు వర్ష సూచన ఉంది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  కడప, చిత్తూరు జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.  అత్యల్పంగా కోస్తాంధ్రలో కళింగపట్నంలో 16.7 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 18 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 19.5 డిగ్రీలు, నందిగామలో 18.1 డిగ్రీలు, నంద్యాలలో 19.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి వాతావరణం పొడిగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాష్ట్రానికి ఎలాంటి సూచన లేదు. మరోవైపు ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై ఉండనుంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

20:16 PM (IST)  •  02 Jan 2022

కరీంనగర్ లో బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జన జాగరణ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీక్షకు అనుమతి లేదని కరీంనగర్ లోని జాగరణ సభావేదిక వద్దకు వచ్చిన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీచేసిన 317 జీవోను సవరించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఇవాళ జన జాగరణ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 5 గంటల వరకు ఆయన జాగరణ దీక్ష చేసి నిరసన చేయాలని నిర్ణయించారు. దీక్షకు సిద్ధమయ్యే సమయంలో అనుమతి లేదని కరీంనగర్ పోలీసులు అడ్డుకున్నారు.  

14:16 PM (IST)  •  02 Jan 2022

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకారం సహా.. ఏపీకి విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలు పరిష్కరించాలని ప్రధానికి సీఎం జగన్‌ వినతి పత్రం ఇవ్వనున్నారు.

12:57 PM (IST)  •  02 Jan 2022

ఎల్బీనగర్ లో దారుణం.. 

* హైదరాబాద్: ఎల్బీనగర్ లో దారుణం.. 
* ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించవద్దని చెప్పిన యువకులపై దాడి
* కేకే గార్డెన్ వెనక ఖాళీ ప్రదేశంలో మందుబాబుల వీరంగం..
* నర్సింహా రెడ్డి అనే యువకుడు మృతి..
* మరో నలుగురికి తీవ్ర గాయాలు, హాస్పిటల్‌లో చికిత్స.. పరారీలో మందు బాబులు
* మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలింపు

11:26 AM (IST)  •  02 Jan 2022

వైఎస్ఆర్ సీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి అరెస్ట్

* వైఎస్ఆర్ సీపీ నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి అరెస్ట్..

* పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు చేసిన మద్దిరెడ్డి..

* అక్రమ కేసులు పెట్టి నా భర్తను అరెస్టు చేయించారు - వైసీపీ జడ్పీటీసీ గీత

* పోలీసులు బలవంతంగా ఇంటి నుంచి కొండ్రెడ్డిని ఈడ్చుకెళ్ళారు - గీత

* పెద్దిరెడ్డి కుటుంబం చేసే అరాచకాలు, అక్రమాలను బయటపెడితే అరెస్టులు చేస్తారా - గీత

* నా భర్తకు ప్రాణ హాని ఉంది. మదనపల్లె సబ్ జైలులో పెద్దిరెడ్డి అనుచరులు కొండ్రెడ్డిపై దాడి చేసే అవకాశముంది. పార్టీ కోసం కష్టపడితే అరెస్ట్ లు చేయించి చంపేస్తారా..? - గీత

10:17 AM (IST)  •  02 Jan 2022

వైఎస్ జగన్ చిన్న అమ్మమ్మ కన్నుమూత

ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్న అమ్మమ్మ ఈశ్వరమ్మ (75) కన్నుమూశారు. ఈమె వైఎస్ విజయమ్మకు పిన్ని. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈశ్వరమ్మ.. నిన్న హైదరాబాద్ లో ఆసుపత్రిలో మృతి చెందారు. అనంతరం కడపలోని ప్రకాష్ నగర్‌లోని ఆమె నివాసానికి మృతదేహాన్ని తరలించారు. ఈశ్వరమ్మ మృతదేహానికి వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, టీటీడీ ఛైర్మన్ 
వైవీ సుబ్బారెడ్డి, రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకెపాటి అమర్ నాథ్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Komaram Bheem Asifabad Tiger Attack News: పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు-  కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
పులి సంచారంతో వణికిపోతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా ప్రజలు- కాగజ్‌నగర్‌ మండలంలో 144 సెక్షన్
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Embed widget