అన్వేషించండి

Breaking News Live: వంగవీటి రాధాకు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live: వంగవీటి రాధాకు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Background

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఈ రోజు గజ్వేల్ నియోజక వర్గంలో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రచ్చబండలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియాకు చూపిస్తానని రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. దీంతో ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అర్ధరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి ముందు పోలీసుల పహారా కాస్తున్నారు.

ఓఆర్ఆర్‌పై ప్రమాదం
రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారును ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలిస్తున్న క్రమంలో ఆగి ఉన్న కారును వెనుక నుండి మరో కారు ఢీకొట్టింది. క్షతగాత్రులను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

హీరో నాని కీలక వ్యాఖ్యలు
హీరో నాని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సమస్య ఉన్నది నిజం.. సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకటవ్వాలి? వకీల్ సాబ్ సినిమా అప్పుడే అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉంటే బాగుండేది. కానీ టాలీవుడ్‍లో ఐకమత్యం లేదు. ఏపీలో సినిమా టికెట్ల రేట్లపై నా అభిప్రాయం మాత్రమే చెప్పా. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారు’’ అని హీరో నాని అన్నారు.

ఒమిక్రాన్ కేసులు
ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ప్రకాశం, అనంతపురం జిల్లాలకు చెందిన ఇద్దరికి ఒమైక్రాన్ వేరియంట్ నిర్ధారణ కావడంతో ఏపీలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఒంగోలుకు చెందిన 48 ఏళ్ల వ్యక్తితోపాటు యూకె నుంచి అనంతపురానికి వచ్చిన 51 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల తర్వాత ఒమిక్రాన్‌గా అధికారులు నిర్ధారించారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్ అందరికీ నెగటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

Also Read: Hyderabad: తల్లి కళ్లెదుటే కొడుకుల రక్తపాతం.. ఒకరు మృతి, కదల్లేని స్థితిలోనే మౌనంగా రోదిస్తూ..

Also Read: కరోనాకు నాటు వైద్యం చేయిస్తామని బాలికతో వ్యభిచారం... 13 మందిని అరెస్టు చేసిన గుంటూరు పోలీసులు

Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

22:09 PM (IST)  •  27 Dec 2021

వంగవీటి రాధాకు సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధాకి సెక్యూరిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 2+2 గన్ మెన్ లను కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. వంగవీటి రాధాపై రెక్కీ ఘటనపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్ డీజీకి ఆదేశాలు జారీ చేశారు. 

18:51 PM (IST)  •  27 Dec 2021

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి జగ్గారెడ్డి ఫిర్యాదు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బైలా పాటించడంలేదని లేఖలో పేర్కొన్నారు. 

18:06 PM (IST)  •  27 Dec 2021

టికెట్ ధరలపై త్వరలో క్లారిటీ: దిల్ రాజు

ఏపీలో టిక్కెట్ రేట్లు, పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఈ అంశంపై ఎవరూ వ్యక్తిగతంగా మాట్లాడవద్దని కోరారు. దీనికి సంబంధించిన కమిటీ ఏర్పాటు చేశామని, ఈ సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

13:58 PM (IST)  •  27 Dec 2021

సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలకు హాజరైన జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

సీపీఎం 26వ రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు మహాసభలు జరగనున్నాయి. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణ మండపంలో మహాసభలు జరుగుతున్నాయి. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ పతాకాన్ని ఎగురవేసి మహాసభలను ప్రారంభించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్ కరత్, బీవీ రాఘవులు ఈ సభలకు హాజరయ్యారు.కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి పై కామ్రేడ్లు భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కు రెడీ అవుతున్నారు..

12:53 PM (IST)  •  27 Dec 2021

టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేయాలి.. కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ ఎంపీలతో రాజీనామా చేయించాలని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన లోక్ సభ- రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసి కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. కానీ టీఆర్ఎస్, బీజేపీ రెండూ రెండేనని ఎద్దేవా చేశారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
TSPSC New Chairman Venkatesam: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బుర్రా వెంకటేశం -- రేవంత్ సర్కారు ఉత్తర్వులు జారీ
Lagacharla Land Issue : లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
లగచర్ల భూసేకరణపై బిగ్ ట్విస్ట్‌- పారిశ్రామిక కారిడార్‌ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల 
Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !
KTR News Today: కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
కొన్నిరోజులపాటు రాజకీయాలకు బ్రేక్‌- సంచలన ట్వీట్ చేసిన కేటీఆర్ 
Pushpa 2: తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్... 'ఆర్ఆర్ఆర్' రికార్డు బ్రేక్ చేస్తేనే బన్నీ బొమ్మ హిట్టు
Andhra Pradesh Weather:మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
మధ్యాహ్నం తీరం దాటనున్న ఫెంగల్‌- నెల్లూరు సహా ఈ జిల్లాలకు రెడ్‌ అలర్ట్- ప్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే ప్రమాదం
TG 10th Exams Pattern: తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
తెలంగాణలో టెన్త్ మార్కుల విధానంపై కీలక అప్ డేట్, వచ్చే ఏడాది నుంచి కొత్త పాట్రన్
Ananya Nagalla: సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
సమంత కాదండోయ్... తెలుగు అమ్మాయి అనన్య
Embed widget