అన్వేషించండి

Congress vs BRS: కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో యాంకర్లు - ఈ రాజకీయం గీత దాటిపోతోంది !

Telangana Politics: రాజకీయ పార్టీల విమర్శలు వాటి మధ్య.. వాటి నేతల మధ్య ఉంటే సమస్య రాదు. కానీ తెలంగాణ రాజకీయాలు.. సంబంధం లేని యాంకర్లు, నటీ మణుల వద్దకు వెళ్తున్నాయి.

Anchors in the middle of Congress vs BRS Politics:  తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ ,  బీఆర్ఎస్ పార్టీల మధ్య సాగుతున్న పోరు ఇప్పుడు వ్యక్తిగత దూషణలు, సోషల్ మీడియా వార్ల స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య   సాగుతున్న ఈ డిజిటల్ దండయాత్ర లో తాజాగా సినీ తారల పేర్లు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

ఈ వివాదానికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి.   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు యాంకర్లకు కూడా గుర్తుండటం లేదని, రాష్ట్రంలో ఆయన ప్రభావం అంతంత మాత్రమేనని ఎద్దేవా చేస్తూ కేటీఆర్ మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నటీమణులు రకుల్ ప్రీత్ సింగ్, అషురెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు.  ఈ వ్యక్తిగత విమర్శలు ఒక్కసారిగా రాజకీయ సెగను పెంచేశాయి.                     

  ఈ స్పందనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి సంబంధం లేని మహిళలను లాగడం, వారిని కించపరిచేలా పోస్టులు పెట్టడం కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం నేరుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ వ్యవహారాన్ని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది.  

 ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని పదేపదే అవమానిస్తున్న బీఆర్ఎస్ నేతలకు తాము తగిన భాషలోనే సమాధానం చెబుతున్నామని కాంగ్రె్స సమర్థించుకుంటోంది. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పంచాయతీ ఎటు దారితీస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూపే ప్రయత్నంలో బీఆర్ఎస్, కేటీఆర్ వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నంలో కాంగ్రెస్ పోటాపోటీగా వ్యవహరిస్తుండటంతో తెలంగాణ రాజకీయం మరింత వేడెక్కింది.                                

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
MCGS MSME Scheme: మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.. అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
మ్యూచువల్ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్.. పూచీకత్తు లేకుండా రూ.100 కోట్ల వరకు లోన్.
Trainee IPS Suicide Attempt: లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
లైంగిక వేధింపుల ఆరోపణలు- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ తెలుసా
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget