అన్వేషించండి

Telangana MP Candidates: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ - 4 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు

Telangana News: తెలంగాణలో 4 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Aicc Released Telangana Mp Candidates List: రాబోయే లోక్ సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ స్థానానికి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి పోరిక బలరాం నాయక్ లను అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. 

అభ్యర్థుల నేపథ్యం ఇదే

జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ అక్కడ పార్లమెంట్ సభ్యునిగా పని చేశారు. 2004 నుంచి 2009 వరకూ నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా చేశారు. 2009 నుంచి 2014 వరకూ లోక్ సభ సభ్యునిగానూ ఉన్నారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గానూ సేవలందించారు.

మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పి.బలరాం నాయక్ 2009 నుంచి 2014 వరకూ 15వ లోక్ సభ సభ్యునిగా పని చేశారు. ఉమ్మడి ఏపీలోని మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ప్రధాని మన్మోహన్ మంత్రి వర్గంలోనూ సేవలందించారు. 

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు కె.రఘువీర్ కు నల్గొండ నుంచి పార్టీ అధిష్టానం ఎంపీగా బరిలో నిలిపింది.

కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని పార్టీ 'కేంద్ర ఎన్నికల కమిటీ' సమావేశమై తెలంగాణ సహా ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హరియాణా, సిక్కిం, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లోని అభ్యర్థులను ఖరారు చేసే అంశంపై కసరత్తు చేసింది. ఇందులో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీతో పాటు పార్టీ సీనియర్ నేతలు జైరాం రమేష్, అంబికాసోని, ముకుల్ వాస్నిక్, టీఎం సింగ్ దేవ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana MP Candidates: తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ - 4 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు

మరోవైపు, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయబోతున్నారు. అలాగే, కన్నడ హీరో శివరాజ్ కుమార్ భార్య గీతకు శివమొగ్గ స్థానాన్ని కేటాయించారు. ఆమె, గతేడాదే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ ను రాజ్ నంద్ గావ్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేయబోతున్నారు.

Also Read: Amit Shah: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణ పర్యటనకు అమిత్ షా - షెడ్యూల్ ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget