News
News
వీడియోలు ఆటలు
X

Adilabad News : అప్పుడు పాపకు పాలు కోసం, ఇప్పుడు పశువుల మేత కోసం- మళ్లీ మొదటికొచ్చిన తాత, తండ్రి అవస్థలు

Adilabad News : తల్లిని కోల్పోయిన చిన్నారి ఆకలి తీర్చేందుకు మంత్రి హరీశ్ రావు ఆవును కొనిచ్చారు. అయితే ఇప్పుడు ఆవుల మేత కరవై.. వారికి మరింత భారమైంది.

FOLLOW US: 
Share:

Adilabad News : తల్లిని కోల్పోయిన పసిపాప ఆకలి తీర్చేందుకు తాత తండ్రి అష్టకష్టాలు పడుతున్నారు. చిన్నారి ఆకలి తీర్చేందుకు పాల కోసం ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు ఈ కుటుంబానికి ఓ ఆవును అందజేశారు. పసిపాప పాలకోసం మరో ఆవును అందజేశారు బోథ్ సేషన్ కోర్టు జడ్జీ హుస్సేన్. అయితే పాలిచ్చే రెండు ఆవులకు మేత కరవైంది. వారికున్న రెండు ఎద్దుల కోసం దాచిన మేత వారంరోజులకే అయిపోయింది. రెండు ఎద్దులకు తోడుగా మరో రెండు ఆవులు రావడంతో మేత లేకుండా పోయింది. నాడు పాలకోసం తాత తండ్రి ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. నేడు పాలిచ్చే ఆవులకు మేత కోసం పదుల కిలోమీటర్ల దూర ప్రయాణం చేస్తున్నారు. పసిపాపకు పాలు కావాలి.. ఆవులకు మేత కావాలి. వేసవిలో మండుటెండలో వెళ్లి రూ. 6000 అప్పుచేసి మూగజీవాలకు మేతకొని తెచ్చారు. దాతల సహకారంతో మేత అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.


అసలేం జరిగింది?

ఆదిలాబాద్ జిల్లాలో ఓ తల్లిలేని పసిపాప పాలకోసం తండ్రి, తాత ఇద్దరు అనేక కష్టాలు పడుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాజుగూడ గ్రామానికి చెందిన కొడప పారుబాయి జనవరి 10వ తేదీన ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కుటుంబ సభ్యులు తిరిగి ఇంటికి తీసుకెళ్లగా వారం రోజుల తరువాత రక్తహీనత కారణంగా అనారోగ్యానికి గురైంది. అయితే కుటుంబ సభ్యులు ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించగా జనవరి 21న ఆమె మరణించింది. దీంతో తల్లిలేని పసిపాపకు పాల కోసం తండ్రి కొడప జంగుబాపు తాత బాపురావ్, రాజుగూడ నుంచి ఇంద్రవెల్లికి ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లి పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాప ఆకలి తీర్చారు. అయితే మార్చి నెల 23న ఈ విషయం మంత్రి హరీశ్ రావు దృష్టికి రావడంతో వెంటనే అధికారులతో మాట్లాడి పాలిచ్చే ఆవును అందించి ఆదుకున్నారు. అలాగే వారం రోజుల క్రితం బోథ్ సెషన్ జడ్జీ హుస్సేన్ సైతం పసిపాపకు పాలిచ్చే మరో ఆవును అందజేశారు. తల్లిలేని పసిపాపకు పాలిచ్చే తల్లిలాంటి ఆవును అందించి ఆదుకోవడంతో పాప తండ్రి, తాత.. మంత్రి హరీశ్ రావు, జడ్జీ హుస్సేన్ లకు కృతజ్ఞతలు తెలిపారు. 


ఆరు వేలు అప్పు చేసి 

అయితే ఇప్పుడు ఆ పసిపాపకు పాలిచ్చే ఆవులకు మేత కరవైంది. మరీ పాపకు పాలు కావాలంటే ఆవులకు మేత కావాలి. పాపతో పాటు రెండు ఆవులకు ఉన్న రెండు దూడలకు పాలు సరిపోవాలి. వీటితో పాటు తమ రెండు ఎద్దులకు సైతం మేత అవసరం. ఇప్పటి వరకు వాటి మేతనే ఆవులకు సైతం వేసి కాలం వెల్లదీశారు. ఇప్పుడు మాత్రం మేత లేదు. వేసవిలో చుట్టూ ప్రక్కల ఎక్కడా పశుగ్రాసం దొరకడం లేదు. గుట్టలపై ఇప్పుడు ఎలాంటి పంటరాదు. ఈ బండరాళ్ల భూమిలో గడ్డికూడ మొలవదు. దీంతో ఆ తాత తండ్రి మళ్లీ పది కిలోమీటర్ల దూరం ప్రయాణించి పశువుల మేత కోసం పడరాని పాట్లు పడుతున్నారు. పాప ఆలన పాలన జంగుబాపు తల్లి ఇంటివద్దే ఉంచి అంతా తానే చూస్తోంది. అయితే వీరిద్దరికి కూడా ఎలాంటి ఉపాధి దొరకడం లేదు. అడవిలో ఉండే రాజుగూడలో వేసవిలో ఏం దొరకదు. చేతిలో చిల్లి గవ్వకూడా లేదు. వర్షాధార పంటలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రేషన్ దుకాణంలో వచ్చే సరుకులతోనే ఇళ్లు గడుస్తుంది. ఇలాంటి తరుణంలో పశువుల మేత కోసం తాత కొడప బాపురావ్ ఇంద్రవెల్లికి చెందిన వైకుంఠం అనే ఓ వ్యక్తి వద్ద ఆరువేల రూపాయలు అప్పుగా తీసుకొని హర్కాపూర్ గ్రామంలో ఓ రైతు వద్ద జొన్న సొప్పా (మేత) కొనితెచ్చాడు. ఒక సొప్పా కట్టా 15 రూపాయల చొప్పున మొత్తం 400 సొప్ప కట్టలు, మొత్తం 6000 రుపాయలు ఇచ్చి ఓ వాహనంలో ఊరికి తెచ్చారు. 

పశువులతో పెరిగిన ఖర్చు 

ఈ సొప్ప ప్రస్తుతం రెండు పాలిచ్చె ఆవులకు, తన వ్యవసాయంలో పనిచేసే రెండు ఎద్దులకు వేసి ఆకలి తీర్చుతున్నారు. మరో 20 లేదా 25 రోజుల వరకు ఈ మేత సరిపోతుంది. తరువాత మళ్లీ మేత అవసరం పడుతుంది. వారికి ఎలాంటి ఏ ఇతర ఉపాది లేదు వారి వద్ద డబ్బులు సైతం లేవు. ఐటీడీఏ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. ఇప్పుడు పాప ఆకలి, పశువుల ఆకలి తీర్చడం కోసం  అప్పు చేసి మరీ మేత తీసుకొచ్చారు. రెండు నెలలు మాత్రం ప్రతిరోజు పాల ప్యాకెట్ కోసం రూ.30, ఇంద్రవెల్లికి ఆటో ఛార్జీకి రాను 20, పోను 20 మొత్తం 70 రూపాయలు ఖర్చయ్యాయి. సుమారుగా నెలలో అన్ని ఖర్చులు కలిసి 3000 రూపాయల వరకు ఖర్చయ్యేది. ఇప్పుడు రెండు ఆవులు, వాటి రెండు లేగదూడలు, మరో రెండు ఎద్దులు వీటన్నింటినీకి సరిపడా మేతకు నెలసరిపడా 6000 రూపాయలు ఖర్చయింది. అదీ అప్పు చేసి మరీ మేత కొనుకొచ్చారు. ఖర్చు భారం పెరిగినందున వారి వద్ద ఎలాంటి ఉపాధి లేకపోవడంతో వారు తమ గోడును ఏబీపీతో పంచుకున్నారు. తమ కష్టాలు తీర్చేందుకు ఎవరైనా దాతలు ఉంటే సహకరించి తమ పశువులకు మేతను అందించాలని కోరుతున్నారు. 

 

Published at : 08 Apr 2023 09:44 PM (IST) Tags: Adilabad News TS News Rajuguda Cow grass Infant milk

సంబంధిత కథనాలు

Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!

Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహం ముందు కళాకారుల భిక్షాటన - ప్రభుత్వానికి వార్నింగ్!

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

Hyderabad Crime News: హైదరాబాద్ లో అర్ధరాత్రి వృద్ధురాలి హత్య, 23 తులాల బంగారం లాక్కెళ్లిన నిందితులు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత 

MLC Kavitha on KCR: తెలంగాణ వచ్చాకే సింగరేణి కార్మికులకు గొప్ప లాభాలు: ఎమ్మెల్సీ కవిత 

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

టాప్ స్టోరీస్

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?

Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?