అన్వేషించండి

Ramesh Rathod: ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Telangana News: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు.

Ex Mp Ramesh Rathod Passed Away: ఆదిలాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ (Ramesh Rathod) (59) శనివారం కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబసభ్యులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ తరలించాలని భావించారు. ఈ క్రమంలో హైదరాబాద్ (Hyderabad) తరలిస్తుండగా మార్గమధ్యలో ఇచ్చోడ వద్ద తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి  పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రమేష్ రాథోడ్ పార్ధీవ దేహాన్ని ఆయన స్వస్థలం ఉట్నూరుకు తరలించారు.

ఇదీ రాజకీయ ప్రస్థానం

రమేశ్ రాథోడ్ సాధారణ స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. 1999లో తొలిసారిగా టీడీపీ తరఫున ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2006 నుంచి 2009 మధ్య కాలంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2009లో ఆ పార్టీ తరఫున ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఇదే సమయంలో ఆయన భార్య సుమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరారు. అనంతర మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్‌లో చేరి 2019లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జూన్ 2021లో ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీలో చేరారు. ఎంపీ టికెట్ కోసం యత్నించారు.

బండి సంజయ్ సంతాపం

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ ఎంపీగా,  జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఆయన అందించిన  సేవలు మరువలేనివని అన్నారు. 'గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. రాథోడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అని అన్నారు.

 కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒకే రోజు ఇద్దరు నేతలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: Darmapuri Srinivas: డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Peelings Song :
"పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?
Vajedu SI Suicide News: ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్య- రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్‌
ములుగు జిల్లా వాజేడు ఎస్సై ఆత్మహత్య- రివాల్వర్‌తో కాల్చుకొని సూసైడ్‌
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
Embed widget