Darmapuri Srinivas: డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం - అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
Telangana News: కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.
Darmapuri Srinivas Funeral With Official Ceremony: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) (Darmapuri Srinivas) మృతి పట్ల తెలుగు రాష్ట్రాల సీఎంలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌లో డీఎస్ కీలక పాత్ర పోషించారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం డీఎస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. డీఎస్ సుదీర్ఘ కాలం రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. ఎప్పుడూ హుందాగా రాజకీయాలు చేసేవారని గుర్తు చేసుకున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేశారని పేర్కొన్నారు.
మాజీ పీసీసీ అధ్యక్షుడు…
— Revanth Reddy (@revanth_anumula) June 29, 2024
మాజీ మంత్రి డి శ్రీనివాస్ గారి…
మరణం బాధాకరం.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి…
ఆయన అందించిన సేవలు…
చిరస్మరణీయం.
ఆయన ఆత్మకు…
శాంతి చేకూరాలని…
భగవంతుడిని ప్రార్థిస్తూ…
కుటుంబ సభ్యులకు…
నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/BPrw4NfXDG
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి రాజకీయాలు చేసిన శ్రీనివాస్ మంత్రిగా, ఎంపిగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ... శ్రీనివాస్… pic.twitter.com/cTpc5rLwLh
— N Chandrababu Naidu (@ncbn) June 29, 2024
ప్రముఖుల నివాళి
డీఎస్ పార్థీవ దేహానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు, పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డీఎస్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజా సేవకే అంకితమయ్యారని.. 2004- 2009 వరకూ అసెంబ్లీలో ఆయన ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. డీఎస్ మృతి పట్ల మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి సంతాపం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో డీఎస్ ట్రబుల్ షూటర్‌గా పేరొందారని.. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డీఎస్ పార్థీవ దేహానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రిగా, ఎంపీగా డీఎస్ సుదీర్ఘ కాలం సేవలందించారని పేర్కొన్నారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
డీఎస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. డీఎస్ పార్థీవ దేహాన్ని ఆస్పత్రి నుంచి బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన స్వగృహానికి తరలించి.. మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డీఎస్ భౌతిక కాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం నిజామాబాద్ తరలిస్తారు. ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: Dharmapuri Srinivas: శీనన్న ఇక లేరు- ప్రముఖల సంతాపం- ఐ విల్ మిస్ యూ డాడి అంటూ ఎంపీ అరవింద్ ఎమోషనల్